తమిళ హీరో సూర్య అంటేనే విభిన్నతకు మరో పేరు. ఎప్పుడూ కొత్త కథలు, కొత్త కోణాలు చూపించే అతనికి మాస్ సినిమాలపై కూడా మంచి పట్టు ఉంది. ఇక ఇప్పుడు వచ్చిందే సాలిడ్ మాస్ ప్యాకేజ్ లా కనిపిస్తున్న ‘కురుప్పు’. సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు విడుదలైన టీజర్, ప్రేక్షకుల్లో పూనకాలు లేపేలా ఉంది.
“కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు…
మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై వచ్చే దేవుడు…”
అనే పంచ్ డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయ్యింది. ఇది సూర్యకు తగిన ఓ మాస్ ఎన్ట్రీలా నిలిచింది.
టీజర్ మొత్తం యాక్షన్ అంధంగా నడవడం గమనార్హం. సూర్య మల్టిపుల్ గెటప్స్ లో మాస్ మేనరిజం దంచికొట్టేశాడు. కొన్ని షాట్లు చూస్తే… నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరుంది లాంటి ఫీల్ వస్తుంది. రజినీకాంత్ మాస్ స్టైల్, గజిని రివైబ్ చేసిన విజువల్స్ కూడా ఇందులో కనిపించాయి.
త్రిష కథానాయికగా కనిపించనుండగా, డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై ఈ సినిమాను రూపొందించారు. డైరెక్టర్ ఆర్.జే.బీ. టీజర్‌లో కేవలం కథను హింట్ చేయకుండా, యాక్షన్ హైలైట్స్ మాత్రమే చూపించడం ఆసక్తికరంగా మారింది. సాయి అభయంకర్ ఇచ్చిన BGM, ఎలివేషన్ కి బలంగా నిలిచింది.
ఇటీవల వరుస ఫ్లాపులతో డీలా పడిన సూర్యకి, ‘కురుప్పు’ తిరిగి ఫామ్‌లోకి తెచ్చే సినిమా అవుతుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ టీజర్ చూస్తే, ఆ నమ్మకానికి బలం చేకూరినట్టే!