సినిమా వార్తలు

కెరీర్‌ను మార్చేసే పాత్రా ?ఆయన బయోపిక్ చిత్రంలో తమన్నా భాటియా !

విభిన్నమైన పాత్రలతో కెరీర్‌ను కొత్త దిశలో తీసుకెళ్తున్న తమన్నా భాటియాకు బాలీవుడ్‌ నుంచి మరో భారీ అవకాశం వచ్చినట్టుగా టాక్ వినిపిస్తోంది. భారతీయ సినీ చరిత్రలో అపురూప స్థానం సంపాదించిన వి. శాంతారాం బయోపిక్‌లో కీలక పాత్రకు తమన్నా ఫిక్స్ అయినట్లు సమాచారం.

అంతే కాదు… ఈ చిత్రంలో తమన్నా శాంతారాం భార్య, అలనాటి నటి ‘సంధ్య’ పాత్రలో కనిపించబోతున్నారట! సినిమా వర్గాల్లో ఇదిప్పుడు హాట్ టాపిక్.

‘చిత్రపతి వి. శాంతారాం’– టైటిల్ కూడా క్లాస్!

ఈ ప్రతిష్ఠాత్మక బయోపిక్‌కు ‘చిత్రపతి వి. శాంతారాం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. బాలీవుడ్ యువ నటుడు సిద్ధాంత్ చతుర్వేది టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, నేషనల్ అవార్డ్స్‌తో వెలుగొందిన ‘నటసామ్రాట్’ దర్శకుడు అభిజిత్ దేశ్‌పాండే ఈ సినిమాకు మెగా ఫోన్ పట్టుతున్నారు.

వి. శాంతారాం తెరకెక్కించిన అనేక క్లాసిక్ చిత్రాల్లో సంధ్య హీరోయిన్‌గా మెరిసిన సంగతి తెలిసిందే. హిందీ, మరాఠీ ప్రేక్షకుల్లో ఆమెకు ఉన్న బలమైన గుర్తింపే ఈ పాత్రకు మరింత వెయిట్ తీసుకొస్తున్నదని ఇండస్ట్రీ టాక్.

తమన్నా ఎందుకు వెంటనే ఒప్పేసుకుంది?

ఇండస్ట్రీ సోర్సెస్ చెప్పేమాట– కథ విన్న వెంటనే తమన్నా ‘అవును.. ఇదే నేను చేయాల్సిన పాత్ర’ అని వెంటనే ఓకే చెప్పిందట! ఇటీవలి కాలంలో విభిన్న కథలను ఎంచుకుంటున్న ఆమె కెరీర్‌కు ఇది మరో మైలురాయి అవుతుందనే నమ్మకంతోనే అంగీకరించిందని తెలుస్తోంది.

షూటింగ్ త్వరలోనే!

ఈ బయోపిక్‌లో వి. శాంతారాం సినీ ప్రయాణం, ఆయన చేసిన ధైర్యవంతమైన ప్రయోగాలు, వ్యక్తిగత జీవితంలోని విషాదాలు, విజయాలు… అన్నింటినీ నిజానికి దగ్గరగా చూపించబోతున్నారు. షూటింగ్ చాలా త్వరలోనే ప్రారంభం కానుంది.

Similar Posts