క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో తెలుగు హీరోయిన్లు తమన్నా, కాజల్ కు పుదుచ్చేరి పోలీసులు సమన్లు జారీ చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ ఖండించారు మిల్కీ బ్యూటీ తమన్నా. అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై చర్యలు తీసుకుంటానని తెలిపింది తమన్నా

.క్రిప్టోకరెన్సీ ఫ్రాడ్ లో తన ప్రమేయం ఉందని వస్తున్న రూమర్స్ తన దృష్టికి వచ్చాయని.. ఇలాంటి ఫేక్ న్యూస్ ని రూమర్స్ ని స్ప్రెడ్ చేయొద్దని మీడియా మిత్రులను కోరుతున్నానని అన్నారు తమన్నా. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినవారిపై చర్యలు తీసుకునే దిశగా తన టీం వర్క్ చేస్తోందని అన్నారు తమన్నా.

అసలేం జరిగింది

కోయంబత్తూరుకు చెందిన ఒక కంపెనీ క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో తనను మోసం చేసిందని.. పుదుచ్చేరికి చెందిన మాజీ సైనికుడు అశోకన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదులో, క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో సదరు కంపెనీ తనను మోసం చేసిందని ఆరోపించారు అశోకన్.రూ.1 కోటి పెట్టుబడి పెట్టానని, అంతే కాకుండా 10 మంది స్నేహితులతో మొత్తం రూ.2.4 కోట్లు పెట్టుబడి పెట్టించానని పేర్కొన్నారు అశోకన్.

,
You may also like
Latest Posts from