తమన్నా ఐటెం సాంగ్స్ కు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. తెలుగు,తమిళం, హిందీలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రాజ్‌కుమార్ రావ్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’ (Stree 2). అందులోని స్పెషల్ సాంగ్ ‘ఆజ్ కీ రాత్’ (Aaj Ki Raat )లో తమన్నా (Tamannaah Bhatia) డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
హారర్ కామెడీ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా రూ.800 కోట్లు వసూలు చేసి, రికార్డు సృష్టించింది. దాంతో తమన్నా సాంగ్ కోసం హిందీ నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా ఆమె మరో స్పెషల్ సాంగ్ కమిటైందని సమాచారం.
అజయ్ దేవ్గన్ హీరోగా నటిస్తున్న ‘రైడ్-2’లో ఓ స్పెషల్ సాంగ్‌లో తమన్నా డ్యాన్స్ చేయనుంది. ఈ పాటలో హనీ సింగ్ కూడా ఉంటారని తెలుస్తోంది. ఈ పాటను ప్రమోషనల్ సాంగ్‌గా తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు ఈ పాట మరింత బూస్ట్ ఇస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. ఈ సినిమాను వేసవి కానుకగా మే 1న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.
మరో ప్రక్క తమన్నా ప్రస్తుతం ‘ఓదెల 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆమె పాల్గొంటూ సందడి చేస్తుంది.