తమిళ, తెలుగు హీరో విశాల్ ముక్కు సూటిగా మాట్లాడుతూంటారు. మనస్సులో అప్పుడు ఏది తోస్తే అదే బయిటకు చెప్పేస్తారు. అవి చాలావరకూ నిజాలు అయినా విమర్శలు వస్తూంటాయి. తాజాగా మ‌ద గ‌జ రాజా సినిమా విజ‌యం సాధించడంతో విశాల్ చెన్నైలోని క‌ప‌లీశ్వ‌ర‌ర్ టెంపుల్‌ని సంద‌ర్శించారు. ఆలయ దర్శనం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ విశాల్ ఏమి మాట్లాడారు.

విశాల్ మాట్లాడుతూ….. “డబ్బు ఉన్నవాళ్లు ఎవరైనా సినిమాలు నిర్మించగలరు. విజయ్ మాల్యా లేదా అంబానీ లాంటి వారు ఎందుకు అందులోకి రాలేకపోతున్నారు? ఎందుకంటే చిత్ర పరిశ్రమలో నష్టాలు ఎక్కువ. ఈ విషయం వాళ్లకు బాగా తెలుసు.

మొదట్లో నేను ఈ మాట చెబితే నన్ను విలన్‌గా చూసేవాళ్లు. ప్రస్తుతం సినిమాల నిర్మాణం కష్టతరంగా మారింది. తమిళ సినిమా నిర్మాణం సవాళ్లతో కూడుకున్నది. పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించడంలో విఫలమయ్యాము” అని విశాల్ అన్నారు.

ఒక సినిమా తీయాలంటే కనీసం రూ.కోటి నుంచి రూ.4 కోట్ల వరకూ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దయచేసి అదే డబ్బును మీ పిల్లల పేరు మీద పిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయండి. లేదంటే, భూమి కొనుగోలు చేయండి. ఇండస్ట్రీలో పరిస్థితులు ఏమాత్రం బాగా లేవని విశాల్ చెప్పారు.

విశాల్ ఇండస్ట్రీకి వచ్చే కొత్త నిర్మాతలను నిరుత్సాహపరుస్తున్నారని, అన్ని వ్యాపారాల్లో లాభ, నష్టాలు ఉంటాయని అక్కడ స్టార్ ప్రొడ్యూసర్స్, నటులు విమర్శలు చేస్తున్నారు. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరే పద్దతిలో విశాల్ బిహేవ్ చేస్తున్నాడని అంటున్నారు.

,
You may also like
Latest Posts from