తమిళ సినీ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్‌ నటిస్తున్న 69వ చిత్రానికి ‘జన నాయగన్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేసి రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అదే రోజు ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను కూడా రిలీజ్‌ చేశారు. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ చిత్రం విజయ్ కెరీర్లో చివరి సినిమా అని, ఈ చిత్రం తర్వాత విజయ్ రాజకీయాల్లోకి ఫుల్ బిజీగా మారనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి ఓవర్ సీస్ లో ఏ తమిళ సినిమాకు కానంత రికార్డ్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు..

“జన నాయకన్” తో తమిళ సినిమాలో ఏ సినిమాకి కూడా జరగని రికార్డు బిజినెస్ ఈ చిత్రానికి ఓవర్సీస్ మార్కెట్ లో జరిగినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీనితో జన నాయకన్ కి ఏకంగా 75 కోట్లకి పైగా ఓవర్సీస్ థియేట్రికల్ డీల్ జరిగినట్టుగా తెలుస్తుంది. తమిళ సినిమా పరిశ్రమలో ఇది రికార్డు మొత్తం .

విజయ్ సినిమాలకి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. లాస్ట్ టైం వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం కూడా మిక్స్డ్ టాక్ తో మంచి నంబర్స్ సాధించింది. ఇపుడు తన చివరి సినిమా కావడంతో హైప్ మరింత ఉన్న నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా భారీ మొత్తాన్నే పెడుతున్నారని చెప్పొచ్చు.

పూజా హెగ్డే హీరోయిన్‌. ఇతర పాత్రల్లో గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, బాబీ డియోల్‌, ప్రియమణి, మమితా బైజు, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు నటిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీవీకే పేరుతోరాజకీయ పార్టీని స్థాపించిన విజయ్‌.. సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

You may also like
Latest Posts from