సినిమా ప్రపంచంలో డైనోసార్ అనే మాటకు జీవం పోసిన చిత్రం ఏదైనా ఉందంటే అది “జురాసిక్ పార్క్” (Jurassic Park)‌నే. స్టీవెన్ స్పీల్‌బర్గ్ మాయాజాలం నుండి పుట్టిన ఈ ఫ్రాంచైజీ, దశాబ్దాలుగా థ్రిల్, విజువల్స్, సైన్స్, హారర్‌ మిశ్రమంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఇప్పుడు అదే సిరీస్‌లో కొత్త శకం మొదలుకాబోతోంది.

Jurassic World Rebirth – డైనోసార్ యుగానికి రీబూట్!

2025లో మళ్లీ డైనోసార్ గర్జనలు మిన్నుమిన్నుంటనున్నాయి! ‘జురాసిక్ వరల్డ్: రీబర్త్’ (Jurassic World: Rebirth) పేరుతో వస్తున్న ఈ తాజా హాలీవుడ్ చిత్రం, మొత్తం ఫ్రాంచైజీలో 7వ చిత్రం కావడం విశేషం. 2022లో వచ్చిన ‘Jurassic World: Dominion’ సంఘటనల తర్వాత ఐదు సంవత్సరాల తరువాత జరిగే కథతో రూపొందింది.

‘గాడ్జిల్లా’ (2014), ‘రోగ్ వన్: ఎ స్టార్ వార్స్ స్టోరీ’, ‘ది క్రియేటర్’ లాంటి విజువల్ ఎపిక్ సినిమాలకు దర్శకత్వం వహించిన గారెత్ ఎడ్వర్డ్స్ ఈ చిత్రాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది పక్కా థియేటరికల్ ఎక్సపీరియన్స్ గా ఉండబోతోందన్న టాక్ ఇప్పటికే ట్రైలర్ల ద్వారా స్పష్టమైంది. మే 20న విడుదలైన రెండో ట్రైలర్ ఈ అంచనాల్ని మరింత పెంచేసింది.

ఈసారి కథలో మాంచి డ్రామా, ఎమోషన్‌, మిళితమై ఉంటుందని తెలుస్తోంది. హాలీవుడ్ అగ్రతార స్కార్లెట్ జోహన్సన్, జోనాథన్ బెయిలీ, మరియు ఆస్కార్ అవార్డు విజేత మహెర్షలా అలీ లాంటి స్టార్లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

జూలై 2, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమా ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో విడుదల అవుతోంది. ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని స్థానిక భాషల్లో విడుదల చేయడం విశేషం.

, ,
You may also like
Latest Posts from