హిట్ 3తో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకొన్న నాని.. ఇప్పుడు పార‌డైజ్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలసిందే. ‘ద‌స‌రా’ ఫేమ్ శ్రీ‌కాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ఇది. రీసెంట్ గానే ఈ చిత్రం ప‌ట్టాలెక్కింది. ఈ ప్రాజెక్టుకు వచ్చిన క్రేజ్ తో బిజినెస్ మొద‌లైపోయింది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ‘పార‌డైజ్‌’ ఆడియో రైట్స్‌ని స‌రిగ‌మ సంస్థ రూ.18 కోట్ల‌కు కొనేసింది. అయితే ట్విస్ట్ ఏమిటంటే ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట కూడా బ‌య‌ట‌కు రాలేదు. కేవ‌లం ఈమ‌ధ్య విడుద‌లైన గ్లింప్స్ చూసి, స‌రిగ‌మ సంస్థ ఆడియో రైట్స్ పై క‌ర్చీఫ్ తీసేసుకుంటోంది.

చిత్రానికి అనిరుథ్ సంగీత ద‌ర్శ‌కుడు. సౌత్ లో ఫామ్ లో ఉన్న సంగీత ద‌ర్శ‌కుడు అనిరుథ్‌. త‌న సినిమా అంటే పాట‌లు క‌చ్చితంగా బాగుంటాయ‌న్న న‌మ్మ‌కం ఉంది. మరో ప్రక్క నాని నిర్మాత‌గా సూప‌ర్ ఫామ్ లో ఉన్నాడు. ద‌స‌రా కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. గ్లింప్స్ కు కూడా అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది.

2026 మార్చి 26న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. అదే రోజున ‘పెద్ది’ కూడా విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. ‘పెద్ది’ వ‌స్తే మాత్రం ‘పార‌డైజ్’ కాస్త వెన‌క్కి త‌గ్గే అవ‌కాశం ఉందంటున్నారు.

, ,
You may also like
Latest Posts from