
నాని ‘ది ప్యారడైస్’ టీమ్‌కి భారీ షాక్?
నేచురల్ స్టార్ నాని చేస్తున్న భారీ ప్రాజెక్ట్ “ది ప్యారడైస్” గురించి టాలీవుడ్లో ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా టీమ్ ఇప్పుడు ఎదుర్కొంటున్నఓ పెద్ద ఛాలెంజ్ ని ఎదుర్కోబోతోంది!
సికింద్రాబాద్ పాతకాలం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నాని ‘జడలు’ పాత్రలో కనిపిస్తున్నారు. బ్రైడెడ్ హెయిర్… మొత్తం బాడీ మీద టాటూలు… —ఈ లుక్ ఇప్పటి వరకూ నాని కెరీర్లోనే రగ్గెస్ట్!
శ్రీకాంత్ ఓదెల (దసరా ఫేం) దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ భారీ చిత్రం హైదరాబాద్‌లో ఫుల్ స్పీడ్‌లో షూట్ అవుతోంది. నాని–మోహన్ బాబు–సోనాలి కులకర్ణి కీలక సన్నివేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. రిలీజ్ డేట్‌గా మార్చి 26, 2026 నిశ్చయించినా… అక్కడికే అసలు ట్విస్ట్!
అనిరుధ్ మ్యూజిక్ పెద్ద బ్రేక్ అవుతుందా?
సినిమా షూట్ బిజీగా సాగుతున్నా… షాకింగ్ విషయమేమిటంటే—ఒక్క పాట కూడా ఇప్పటివరకు రికార్డ్ కాలేదు! అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం “జైలర్ 2”, “కింగ్” లాంటి స్టార్ ప్రాజెక్ట్‌లతో ఫుల్ లోడులో ఉండటంతో… ఆయన్ని నుంచి సాంగ్స్, BGM రావడం టైమ్ తీసుకునే పని అని తెలిసిన విషయమే.
ఇదే సమయంలో రామ్ చరణ్ ‘పెద్ది’ మాత్రం మొదటి సాంగ్ “చికిరి చికిరి” ని రిలీజ్ చేసి ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది. దీంతో “ది ప్యారడైస్” టీమ్‌పై ప్రెషర్ రెట్టింపు అయ్యింది.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల చెన్నైలో ఉండి అనిరుధ్‌తో మ్యూజిక్ సెషన్స్ జరుపుతున్నారు.
గ్లోబల్ రిలీజ్ ప్లాన్… ర్యాన్ రేనాల్డ్స్ ఎంట్రీనా?
ఈ సినిమాని పాన్-వరల్డ్ లెవల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కొంతకాలం క్రితం రియన్ రేనాల్డ్స్ ఈ సినిమాకి ప్రెజెంటర్‌గా రావొచ్చని టాక్ వచ్చి హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై అధికారిక అప్డేట్ మాత్రం ఇంకా రాలేదు.
‘ది ప్యారడైస్’కి టైమ్ రన్ అవుతుందా?
నాని లుక్, రగ్గ్డ్ క్యారెక్టర్, భారీ స్కేల్—ఆల్ ఫెరఫెక్ట్… కానీ మ్యూజిక్ డిలే మాత్రం రిలీజ్ టార్గెట్‌పై పెద్ద ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఇప్పటికైనా స్పీడ్ పెంచకపోతే… మార్చి 2026 డేట్ కేవలం డ్రీమ్‌గా మిగిలిపోచ్చు!
