“విక్రమ్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన కమల్ హాసన్ ని ‘భారతీయుడు 2’ పూర్తిగా వెనక్కి లాగేసింది. ఆ సినిమా మీద వచ్చిన నెగటివిటీ ఇప్పుడు ఆయన్ని భాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఎగ్జామ్ రూమ్ లోకి లాక్కెళ్లింది. అయితే కమల్ మామూలు వాడు కాదు. ఇప్పుడు ‘థగ్ లైఫ్’ రూపంలో కమల్ మరోసారి తన మార్కెట్‌ను రీడిఫైన్ చేయబోతున్నాడు.

ఈ సినిమా బిజినెస్ చూసిన తర్వాత… ఒక్క మాటే అనిపిస్తుంది. ఇది సినిమా మార్కెటింగ్ కాదు, స్ట్రాటజిక్ మాస్టర్‌పీస్. మణిరత్నం & కమల్ హాసన్ కాంబినేషన్, అదే థగ్ లైఫ్ రూపంలో వచ్చి – మార్కెట్ ని షేక్ చేస్తోంది.

బిజినెస్ డీల్ బ్రేక్‌డౌన్

డిజిటల్ రైట్స్ (అన్ని భాషల్లో): Netflix → ₹150 కోట్లు!

Netflix మొదటి రోజుల్లోనే ఈ డీల్ కొట్టేసింది. కారణం? మణిరత్నంతో నెట్‌ఫ్లిక్స్ కి క్లోజ్ కనెక్షన్ . ఇది మణిరత్నం బ్రాండ్ మీద పెట్టిన భారీ బెట్.

శాటిలైట్ రైట్స్: Vijay TV → ₹60 కోట్లు!
కామర్స్ ప్లస్ కమల్ ఫ్యాన్ బేస్ కలిస్తే, TV రేటింగ్స్ హైగా వస్తాయన్న క్యాలిక్యులేషన్.

టోటల్ నాన్ థియేట్రికల్ రికవరీ: ₹210 కోట్లు

మొత్తం బడ్జెట్ అంతా ఇదివరకే రికవర్ అయిపోయింది. అంటే ఇక థియేట్రికల్ ప్రాఫిట్ గేమ్ మిగిలింది.

ఈ సినిమాలో ఉండబోయే భారీ కాస్ట్ చూస్తే… ఇది కేవలం కమల్ సెంట్రిక్ సినిమా కాదు, ఇది ఒక Pan-India Star Ensemble: శింబు, త్రిషా, సానియా మల్హోత్రా, అభిరామి, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మి, జోజు జార్జ్, నాజర్, అలి ఫజల్. ఇది మణిరత్నం మార్క్ కాస్టింగ్. మల్టీ-లేయర్డ్ నేరేషన్ కి ఇది జస్ట్ ట్రైలర్ లాంటి లైన్ అప్.

కమల్ – మణిరత్నం కాంబోకి సౌండ్‌ట్రాక్ తో దుమ్మురేపటానికి రెడీగా ఉన్నాడు ఏఆర్ రెహ్మాన్.

,
You may also like
Latest Posts from