టాలీవుడ్ నటి కందూరి శ్రీరంగ సుధ (కె.సుధ)పై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు వైరల్ కావడంతో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఆమె పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు నమోదు చేశారు.
శ్రీరంగ సుధ ఫిర్యాదులో రాధాకృష్ణ అనే వ్యక్తే తనపై అసభ్యకరమైన పోస్టులకు కారణమని , తన ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు లీక్ చేస్తానని ఇంతకు ముందు బెదిరించిన విషయాన్ని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అతడు ట్విట్టర్ పేజీలలో తన ప్రతిష్ట దెబ్బతినేలా ఇబ్బందికర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్నాడని తెలిపారు.

పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అశ్లీల కంటెంట్ షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే శ్రీరంగ సుధ, సోషల్ మీడియాలో మాత్రం స్టార్. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె గ్లామరస్ ఫోటోషూట్లకు 9 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు.