సినిమా వార్తలు

రెండు వారాల మౌనం తర్వాత త్రిష ఇన్‌స్టాగ్రామ్ బాంబ్!

దశాబ్దాలు గడుస్తున్నా ఆ గ్లామర్ తగ్గలేదు, ఆ క్రేజ్ తగ్గలేదు. సౌత్ క్వీన్ త్రిష అడుగు బయటపెట్టిందంటే చాలు.. సోషల్ మీడియాలో సెగలు పుట్టాల్సిందే. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ విజయ్‌తో ముడిపెడుతూ వస్తున్న వార్తలు ఇండస్ట్రీని ఊపేస్తున్నాయి. విజయ్ భార్య విడాకులకు సిద్ధమైందన్న రూమర్స్ మధ్య, అందరూ షాక్ అయ్యేలా విజయ్‌తో కలిసి చెన్నైలో ఒక పెళ్లి వేడుకలో త్రిష మెరిసింది. తాజాగా ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట మంటలు రేపుతోంది.

దాదాపు రెండు వారాల మౌనం తర్వాత త్రిష తన ఇన్ స్టాగ్రామ్ లో బాంబు పేల్చింది. గోల్డ్ కలర్ సిల్క్ శారీ, ఎర్రటి బార్డర్, దానికి తగ్గట్టుగా రెడ్ కలర్ బ్లౌజ్‌లో దేవకన్యలా మెరిసిపోతున్న ఫొటోలను షేర్ చేసింది. సోఫాలో కూర్చుని ఆమె ఇచ్చిన పోజులు చూస్తుంటే కుర్రకారుకు మతిపోవడం ఖాయం. విజయ్‌తో కలిసి పబ్లిక్‌గా కనిపించిన మరుసటి రోజే ఈ పోస్ట్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న విమర్శలు, రూమర్లపై త్రిష ఇండైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చేసింది. “ఎప్పుడూ నాకు తోడుగా నిలిచే నా అభిమానులకు ధన్యవాదాలు” అంటూ ఒక ఎమోషనల్ మెసేజ్ రాసుకొచ్చింది. తన వ్యక్తిగత జీవితంపై ఎన్ని వార్తలు వచ్చినా, తన ఫ్యాన్స్ ఇచ్చే సపోర్ట్ తనకి కొండంత అండ అని చెప్పకనే చెప్పింది. విజయ్ భార్య సంగీత విడాకుల ఇష్యూ నడుస్తున్న తరుణంలో, త్రిష ఇలా విజయ్ పక్కన కనిపించడం, మరుసటి రోజే ఇంత హాట్ గా ఫొటోలు పెట్టడం చూస్తుంటే ఏదో పెద్ద గత్తర జరుగుతోందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే, మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ షూటింగ్ పూర్తి చేసిన త్రిష, కోలీవుడ్ లో సూర్యతో కలిసి ‘కురుప్పు’లో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదే థియేటర్లను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

మొత్తానికి త్రిష వేసిన ఈ ‘గోల్డ్’ స్కెచ్ చూస్తుంటే, అటు రూమర్లకు చెక్ పెడుతూనే, ఇటు తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేస్తోంది. మరి విజయ్-త్రిషల ఈ ‘మ్యాజికల్’ అప్పియరెన్స్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. త్రిష లేటెస్ట్ లుక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి

Similar Posts