యాదగిరి దామోదర రాజు ( విక్టరీ వెంకటేష్) ఓ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌. అతను సస్పెండ్ అయ్యి తన ఊరు రాజమండ్రి వెళ్లిపోతాడు. అక్కడ భాగ్యలక్ష్మీ అలియాస్ భాగ్యం (ఐశ్వర్య రాజేశ్)ను పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్తాడు. నలుగురు పిల్లలతో లైఫ్ సరదాలు, సంతోషాలుతో లీడ్ చేస్తూంటాడు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఇంటర్నేషనల్ టాప్ కంపెనీ సీఈఓ సత్య ఆకెళ్ళ(అవసరాల శ్రీనివాస్) ఇండియా పర్యటకు వస్తాడు. ఆ క్రమంలో తమ రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం(నరేష్) తెలంగాణకు ఆహ్వానిస్తారు.అయితే అనుకోని విధంగా ఓ గ్యాంగ్ సత్య ఆకెళ్ళని కిడ్నాప్ చేసి జైల్లో ఉన్న తమ అన్న పప్పా పాండేని విడుదల చేయమంటారు.

సత్య కిడ్నాప్ బయటకు తెలిస్తే తమ రాష్ట్ర పరువు, సీఎం పదవి పోతుందని ఎవరికీ తెలియకుండా అతన్ని జాగ్రత్తగా కాపాడటానికి మాజీ పోలీసాఫీసర్ YD రాజు(వెంకటేష్)ని తేవాలనుకుంటారు. అప్పుడు రాజుని తీసుకురావడానికి అతని మాజీ ప్రేయసి, సత్యకి సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్ మీనాక్షి(మీనాక్షి చౌదరి)వెళ్తుంది.

మీనాక్షి మరెవరో కాదు…గతంలో రాజుకు పెళ్లికాక ముందు రాజును తొలి చూపులోనే చూసి ఇష్టపడుతుంది . అయితే కొన్ని కారణాలతో మీనాక్షి బ్రేకప్ చెప్పేస్తుంది. దాంతో ఇద్దరూ విడిపోయి ఎవరి ప్రపంచంలో వాళ్లు పడిపోతారు. ఇప్పుడు మళ్లీ రాజు జీవితంలోకి మీనాక్షి వచ్చింది. అది భార్య భాగ్యంకు నచ్చదు. దాంతో రెస్కూ ఆపరేషన్ కు వెళ్లాలంటే తనను కూడా తీసుకెళ్లాలని కండీషన్ పెడుతుంది. అప్పుడు ఏమైంది. సత్య ఆకెళ్ళని రాజు కాపాడాడా? ఓ వైపు భార్య, మరోవైపు ప్రియురాలి మధ్య రాజు ఎలా నలిగిపోయాడు? సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్‌తో కథకు లింక్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది

ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా అని చూసే వాళ్లకు తెలుసు. కాబట్టి అనిల్ రావిపూడి కథ, ఎమోషన్, లాజిక్ వంటివి పట్టించుకోలేదు. సీన్ లో ఫన్ పండించడంపైనే దృష్టి పెట్టారు. అయితే ఎమోషన్ ,లాజిక్ ఉంటే పండే ఫన్, అవి లేనప్పుడు ఆ స్దాయిలో ఉండదు. ఫ్యామిలీ సీన్స్ కి క్రైమ్ ఎలిమెంట్ ఫెరఫెక్ట్ సింక్ అవ్వలేదు.

ఐడియా లెవిల్లో బాగున్నా ఈ సినిమా ట్రీట్మెంట్ పరంగా సెట్ కాలేదు. ఎఫ్ 2లో ఫ్రస్ట్రేషన్ ఇందులో కంటిన్యూ చేసారు. కానీ పూర్తిగా సెట్ కాలేదు. అలాగే ఫస్టాఫ్ ఫన్ తో పరుగెత్తింది. అయితే సెకండాఫ్ కు వచ్చేసరికి యాక్షన్ ఎపిసోడ్స్ కు చోటు ఇవ్వటం కోసం ఫన్ ని తగ్గించుకుంటూ వెళ్లారు.

టెక్నికల్ గా ..

సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండటం కలిసొచ్చింది. దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకేనిపించాయి. కామెడీ సినిమా కదా అని పెద్ద పట్టించుకున్నట్లు లేరు. పాటల్లో రెండు బ్లాక్ బస్టర్స్…థియేటర్స్ లో జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్స్ ఇద్దరూ పోటీ పడ్డారు ..వెంకటేష్ కామెడీ టైమింగ్ ని అందుకోవటానికి . అయినా ఐశ్వర్యా రాజేష్ ఫుల్ మార్కులు కొట్టేసింది.

ఏవి బాగున్నాయి:

  1. ఎప్పటిలాగే వెంకటేష్ కామెడీ టైమింగ్
  2. అనీల్ రావిపూడి ల్యాగ్ లేని స్పీడ్ నేరేషన్
  3. బుల్లి రాజు క్యారక్టర్

ఏవి బాగోలేవు:

  1. మరీ అతికించినట్లు ఉన్న కొన్ని కామెడీ సీన్స్
    -సెకండాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్ మరీ ఎపిసోడిక్ గా ఉండటం
  2. కొన్ని చోట్ల చుట్టేసినట్లు ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్

చూడచ్చా

పండగ సినిమా ఎంతో కొంత ఫన్ తో ఉంది కాబట్టి ఓ లుక్కే యచ్చు. ఎక్కువ ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్తే హ్యాపీగా తిరిగి రావచ్చు.

,
You may also like
Latest Posts from