విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫిల్మ్ కింగ్డమ్ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదలై, ఓపెనింగ్ రోజునే అద్భుతమైన కలెక్షన్లు సాధించింది. అభిమానుల నుంచి మొదట మంచి స్పందన వచ్చినా, వారం అంతా అదే జోరు కొనసాగలేకపోయింది. విడుదలైన మొదటి రోజే సినిమాకు క్రేజ్ పీక్ లో ఉండగా, ఆదివారం నాటికి ఆ ఉత్సాహం కొంత తగ్గిపోయింది.

మొదటి రెండు రోజులు కలెక్షన్లు స్ట్రాంగ్ గా రాబట్టినప్పటికీ, శనివారం, ఆదివారాల్లో ఆ ఊపు బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఆదివారం వసూళ్లు నిరాశపరిచాయి, దీని వల్ల సినిమా బ్లాక్‌బస్టర్ రేసులో వెనకపడిందనే చెప్పాలి.

లాంగ్ ఫస్ట్ వీకెండ్ నాటికి కింగ్డమ్ రూ.60 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్‌ను రాబట్టింది. అయితే సినిమా పూర్తిగా మెప్పించలేకపోయింది. ఫస్ట్ హాఫ్‌ మెచ్చుకున్న ప్రేక్షకులు, సెకండ్ హాఫ్‌ బాగోలేదని పెదవి విరిచారు . ముఖ్యంగా “హృదయం లోపల” అనే పాపాలర్ రొమాంటిక్ సాంగ్‌ను తొలగించడమే యూత్ పై ప్రతికూల ప్రభావం చూపింది.

అదే విధంగా, భావోద్వేగాలు బలంగా నిలవాల్సిన సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి అధిక ప్రాధాన్యం ఇచ్చిన తీరు, సినిమా నేరేషన్‌కు తీవ్రంగా నష్టమయ్యిందని విమర్శలు వచ్చాయి.

అమెరికాలో తొలి వీకెండ్‌లో $1.6 మిలియన్ వసూలు చేసినా, గరిష్ఠంగా ఆశించిన $2 మిలియన్ మార్క్‌ను అందుకోలేకపోయింది.

కింగ్డమ్ విజయ్ దేవరకొండకు వరుస ఫెయిల్యూర్స్ తర్వాత కొంత ఊరట ఇచ్చింది గానీ, డివైడ్ టాక్ నేపథ్యంలో, దీని లాంగ్ రన్ చాలా ఛాలెంజ్ గా  మారింది.

, , , , , ,
You may also like
Latest Posts from