విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘కింగ్డమ్’ ఆగస్ట్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ సినిమా కూడా టాలీవుడ్‌లో నడుస్తున్న తాజా ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. అంటే ఏంటి అంటే… ఏపీలో టికెట్ రేట్లు పెంచేస్తున్నారు!

ఇప్పుడిప్పుడు స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే కాదు, టియర్-2 హీరోల సినిమాలకూ టికెట్ ధరలు పెంపు సాధారణం అయిపోయింది. ‘కింగ్డమ్’ నిర్మాతలు నాగ వంశీ అండ్ టీం కూడా అదే రూట్ తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి ఒకే 10 రోజుల పాటు టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ₹50 పెంపు

మల్టీప్లెక్సులలో ₹75 పెంపు (GSTతో కలిపి)

దీంతో ఆపద్ధర్మంగా:

సింగిల్ స్క్రీన్ల టికెట్ ధర ₹200కి చేరనుంది

మల్టీప్లెక్స్ టికెట్ ధర ₹250 వరకు ఉండనుంది

తెలంగాణ విషయానికొస్తే అక్కడ ఇప్పటికే మల్టీప్లెక్స్‌లకు ₹295 ధర అనుమతితో ఉన్న నేపథ్యంలో, ‘కింగ్డమ్’కి అక్కడ టికెట్ హైక్ ఉండే అవకాశాలు తక్కువే.

, , , , ,
You may also like
Latest Posts from