సినిమా వార్తలు

కుట్ర ? : విజయ్ విడాకుల కాగితాల్లో అసలు ఏముంది? త్రిష పేరు ఎందుకు వచ్చింది?

తమిళ సూపర్ స్టార్, రాజకీయ నేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు సౌత్ ఇండియాలోనే హాట్ టాపిక్. విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇస్తున్నారనే వార్త గతేడాది నుంచే వినిపిస్తున్నా, తాజాగా బయటకు వచ్చిన కోర్టు డాక్యుమెంట్లు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ విడాకుల వెనుక ఒక స్టార్ హీరోయిన్ హస్తం ఉందనే ప్రచారం కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. విజయ్ పొలిటికల్ పార్టీ ‘టీవీకే’ (TVK) ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలోనే ఈ విడాకుల పత్రాలు లీక్ అవ్వడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చెన్నై ఫ్యామిలీ కోర్టులో సంగీత దాఖలు చేసిన పిటిషన్‌లో షాకింగ్ విషయాలు ఉన్నట్లు సమాచారం. విజయ్ ఒక నటితో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే తాము గత కొన్ని నెలలుగా విడిగా ఉంటున్నామని ఆమె ఆరోపించినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కొందరు రాజకీయ నేతలు నేరుగా త్రిష పేరును ఈ వివాదంలోకి లాగారు. విజయ్, త్రిషల మధ్య ఉన్న స్నేహం హద్దులు దాటిందంటూ వస్తున్న కామెంట్లతో ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అవుతోంది.

త్రిష సైలెన్స్ వెనుక ఉన్న గుట్టు ఏంటి?

ఈ రచ్చ మొత్తం జరుగుతున్నా త్రిష మాత్రం అస్సలు నోరు మెదపడం లేదు. రీసెంట్‌గా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఫోటోలు పెట్టిన ఈ భామ, ఆ తర్వాత సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైపోయింది. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించకుండా ఇలా మౌనంగా ఉండటం వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉందని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు. త్రిష మౌనం ఈ వివాదాన్ని మరింత రాజేస్తోంది.

విజయ్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీయడానికి ప్రత్యర్థులు ఈ విడాకుల డ్రామాను వాడుకుంటున్నారా? లేక నిజంగానే విజయ్-త్రిషల మధ్య ఏదో నడుస్తోందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏది ఏమైనా, తన భర్త మరో నటి మోజులో పడ్డాడని సంగీత చేసిన ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్‌లో పెను తుఫానును సృష్టించాయి. మరి ఈ వ్యవహారంపై త్రిష ఎప్పుడు స్పందిస్తుందో, ఇంకెన్ని సంచలనాలు బయటకు వస్తాయో వేచి చూడాలి!

Similar Posts