సినిమా వార్తలు

Jailer 2: బాలయ్యకు ఆఫర్ చేసిన రోల్‌ను ఎవరు చేస్తున్నారో తెలుసా? షాకింగ్ న్యూస్!

జైలర్ 2పై వరుసగా వస్తున్న రూమర్స్‌కు ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్. రజినీకాంత్–నెల్సన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ భారీ సీక్వెల్‌లో బాలకృష్ణ కామియో ఖాయమనే టాక్ నెలల తరబడి వినిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య కోసం రాసిన రోల్‌ను ఇప్పుడు వేరే హీరోకు ఫైనల్ చేశారట!

ఎవరు బాలయ్య పాత్రలను రీప్లేస్‌డ్ చేస్తున్నది?

జైలర్ 1 సమయంలోనే నెల్సన్ బాలకృష్ణ కోసం ఒక పవర్‌ఫుల్ కామియో రోల్ ఆలోచించాడట. కానీ కథకు సరిగ్గా మ్యాచ్ కాకపోవడంతో ఆ ఆలోచన‌ను ఆపేశారు. అయితే జైలర్ 2 అనౌన్స్ అయిన వెంటనే అభిమానులు మళ్లీ అవే ఎక్సపెక్టేషన్స్.

“ఈసారి బాలయ్య పక్కా వస్తాడు!”

నెల్సన్ టీమ్ బాలయ్యతో చర్చలు జరిపిందని, మీటింగ్స్ కూడా జరిగాయని ఇండస్ట్రీ టాక్. కానీ చివరకు బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడానికి కన్‌విన్స్ కాలేదట.

అయ్యితే? వెంటనే ఇతర స్టార్‌ల వైపు మేకర్స్ మలుపు!

తర్వాత ఈ పాత్ర కోసం పెద్ద పెద్ద నటుల్ని సంప్రదించిన మేకర్స్, చివరకు నిర్ణయాన్ని తీసుకున్నారు. బాలయ్యకు ప్లాన్ చేసిన అదే రోల్… విజయ్ సేతుపతికే ఫైనల్! పేట తర్వాత రజినీకాంత్‌తో ఆయన ఇది రెండో కొలాబిరేషన్. ఈసారి ఆయన ఒక శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సేతుపతి సీన్లు గోవాలో షూట్ అవుతున్నాయట.

డిసెంబర్ 12న టీజర్: తలైవర్ బర్త్‌డేకు మాస్ బాంబ్ రెడీ!

సినిమా మీద అంచనాలు ఆకాశమంత ఎత్తులో ఉన్న వేళ, డిసెంబర్ 12 — రజినీకాంత్ బర్త్‌డేరోజు టీజర్ రిలీజ్ ప్లాన్ చేశారు మేకర్స్.ఇండస్ట్రీలో మాట — “ఈ టీజర్ ఒక్కటే జైలర్ 2 హంగామా ఏ రేంజ్‌లో ఉండబోతుందో చూపిస్తుందట!”

ఏదైమైనా బాలకృష్ణ రాకపోవడం కొంతమందిని నిరాశపరిచినా,విజయ్ సేతుపతి ఎంట్రీతో మాత్రం జైలర్ 2 కాస్టింగ్ మరింత సాలిడ్ అయ్యిందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇప్పుడు అందరి దృష్టి డిసెంబర్ 12పై — “టీజర్‌లో సేతుపతి గ్లింప్స్ ఉంటాయా?” అంటూ మాస్ ఆడియెన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు!

Similar Posts