తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్ వచ్చి వైరల్ అవుతోందంటే ఓ పేరు తప్పనిసరిగా వినిపిస్తుంది. అదే శ్రీలీల! స్క్రీన్ ప్లే ఆమె అడుగు పడితే… మెరుస్తుంది, స్టెప్స్ శబ్దం చేస్తాయి, సోషల్ మీడియా తడబడుతుంది. జింతక, కుర్చీ మడతపెట్టీ లాంటి సాంగ్స్ తరువాత, ఇప్పుడు ఆమె మాజిక్ మరోసారి దుమ్ము రేపుతోంది. అదే ‘వైరల్ వయ్యారి’ రూపంలో! సోషల్ మీడియా మొత్తం వైరల్ వయ్యారి అనే పదం చుట్టే తిరుగుతోంది. శ్రీలీల డాన్స్ ట్రెండ్‌ను డిక్షనరీలో రిజిస్టర్ చేస్తోంది! ఆ పాటను మీరూ చూసేయండి.

సాంగ్ వివరాల్లోకి వెళితే…

శ్రీలీల , కిరీటీ జంటగా వారాహి చలన చిత్రం బ్యానర్ మీద సాయి కొర్రపాటి నిర్మించిన చిత్రం ‘ జూనియర్ ’. ఈ మూవీకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో గాలి వారసుడు కిరీటీ తెరపైకి హీరోగా రాబోతోన్నారు. ఇక ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్‌ను దేవీ శ్రీ ప్రసాద్ చాలా శ్రద్ద పెట్టారు. ఇక ఇప్పుడు ఈ మూవీ కోసం వింటేజ్ డీఎస్పీని చూపించారు.

తాజాగా వైరల్ వయ్యారి అంటూ వదిలిన పాట సోషల్ మీడియాని ఊపేస్తోంది. ఆ పాటకు కళ్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. ఈ పాటను డీఎస్పీ, హరి ప్రియ ఆలపించారు. రేవంత్ గొల్లమండల కొరియోగ్రఫీ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from