మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సోషియో-ఫాంటసీ భారీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో “Release Date Update Plz!” అంటూ ట్రెండింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఈ ఉత్సాహానికీ, ఊహాగానాలకీ ముగింపు పలకబోతున్నారు మేకర్స్!

బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను సెప్టెంబర్ 18న గా ఖరారు చేసే ప్రయత్నాల్లో టీమ్ ఉంది. ఇది దసరా సెలవుల సమయంలో వస్తుండటంతో, పండగ ప్లేవర్ సినిమాకు మరింత ప్లస్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అదే వారం తర్వాత, సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన “ఓజీ” రిలీజ్ కావడంతో, మేకర్స్ ఈ గ్యాప్‌ను స్మార్ట్‌గా వాడుకుంటున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్ వర్క్ తుది దశలో ఉంది. టెక్నికల్ టీమ్ నానాటికీ డీల్‌లను ఫైనలైజ్ చేస్తోంది. ఒఫిషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా జూలై నెలలో ప్రకటించబోతున్నట్లు సమాచారం.

ఇప్పటికే జియో హాట్‌స్టార్ డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ ఫ్యాంటసీ విజువల్ ఎక్స్‌ట్రావగాంజాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తాన్ని పూర్తిచేశారు, మిగిలింది కేవలం ఓ ఐటెం సాంగ్ మాత్రమే.
అందుకే… ఇప్పుడు ప్యాన్స్ చేస్తున్న పని ఒకటే —
విశ్వంభర థియేటర్లలోకి వచ్చే రోజు కోసం కౌంట్‌డౌన్ మొదలెట్టడం!

“విశ్వంభర వస్తోంది… మెగామేజిక్ తో !” అని ఎదురుచూడటం.

, , , , ,
You may also like
Latest Posts from