
ఎన్టీఆర్ కన్ఫూజన్ తోనే ‘దేవర 2’ కి ఎండ్ కార్డు??
ఎన్నాళ్లుగానో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ఇండస్ట్రీలో నడుస్తున్న ‘దేవర 2’ క్యాన్సిలేషన్ వార్త… చివరికి నిజమైపోయిందని తెలుస్తోంది. ఇప్పటికే చాలాసార్లు రూమర్స్ వచ్చినా, ఈసారి మాత్రం కొరటాల కన్‌ఫర్మ్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి.
NTR ఆసక్తి తగ్గడంతోనే దేవర 2 కు ఎండ్ కార్డ్?
అసలు మొదట్లోనే NTR కి ‘దేవర 2’ మీద ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండేది. కానీ ఇటీవలే ‘వార్ 2’కి వచ్చిన షాకింగ్ స్పందన తారక్ ఆలోచనలు పూర్తిగా మార్చేసిందట.
“సీక్వెల్ అంటేనే ఫ్యాన్స్ థియేటర్స్‌కు పరుగు తీస్తారు అన్న రోజులూ పోయాయి” అన్న రియాలిటీని ‘వార్ 2’ స్పష్టంగా చూపించేసింది.
అదే కారణంగా, “దేవర 2 తీసినా వర్కవుట్ అవుతుందా?” అన్న సందేహం టీమ్‌లో పెరిగిపోయిందని ఇన్‌సైడ్ టాక్.
దేవర హిట్ అయినా… సీక్వెల్ బిల్డ్-అప్ మాత్రం వర్కౌట్ కాలేదు!
‘దేవర’ భారీ కమర్షియల్ హిట్—ఇది డిబేట్‌కి లేకపోని విషయం. కానీ… సీక్వెల్ సెటప్ మాత్రం పెద్దగా ఎగ్జైట్ చేయలేదన్న మాట నిజం.
అది కూడా తారక్‌కు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన కారణాల్లో ఒకటే.
నిర్మాతలు కూడా రూమర్స్‌ని కన్‌ఫర్మ్ చేశారా?
ఇండస్ట్రీలో రూమర్ వేగంగా వైరల్ కావడంతో, కొన్ని మీడియా & ఫిల్మ్ సర్కిల్స్ నిర్మాతలను డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
వారు కూడా “అవును… దేవర 2 ప్లాన్ పూర్తిగా ఆగిపోయింది” అని చెప్పినట్లు సమాచారం.
ఇది బయటపడిన వెంటనే—
“దేవర సీక్వెల్ పూర్తిగా షెల్వ్” అన్న మాట పక్కాగా వినిపిస్తోంది.
ఇక దేవర 2 అసలు ఉండదా?
అవును… ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం,
NTR – Koratala Siva కాంబినేషన్‌లో ‘దేవర 2’ ఇక ఉండదని క్లియర్ అయ్యినట్లే.
టీమ్ ఇప్పుడు అధికారిక ప్రకటన ఎప్పుడు ఇస్తుందన్నదే సస్పెన్స్. అయితే ఇలాంటివి అధికారక ప్రకటనలు ఇస్తారా.
ఒకవేళ క్లారిటీ రాకపోతే—
తదుపరి ప్రెస్ మీట్స్‌లో ఇదే ప్రశ్న మళ్లీ మళ్లీ ఎదురవ్వటం ఖాయం. ఏదైమైనా టాలీవుడ్‌లో ఇదే పెద్ద షాకింగ్ న్యూస్!
