భారతీయ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నటులతో, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు. తెలుగు నుంచి చిరంజీవి, నాగార్జున ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్)’ను నిర్వహించనుంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం భారతీయ సినీపరిశ్రమకు చెందిన ప్రముఖ నటీనటులు, వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సమ్మిట్ కోసం వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్ కపూర్, అనుపమ్ ఖేర్, హేమమాలినీ, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు.
రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ భేటీపై ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు.
‘వేవ్స్’ అడ్వైజరీ బోర్డుతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ బోర్డులో సభ్యులైన సినీతారలు, వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు మద్దతు పలకడంతోపాటు సమ్మిట్ కోసం వారి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారని పేర్కొన్నారు.