ప్రస్తుతం రామ్ చరణ్‌ నటిస్తున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘పెద్ది’ చుట్టూ వార్తలు, గాసిప్స్ రోజు రోజుకూ మరింత ఊపందుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చి బాబు, ప్రేక్షకుల్లో ఉన్న భారీ అంచనాలను అందుకోవడానికి ఒక్క క్షణం కూడా వృధాకానివ్వకుండా పని చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ‘గేమ్‌చేంజర్’ ఫ్లాప్‌తో పెద్ద ఇబ్బంది ఎదుర్కొన్న రామ్ చరణ్‌కు, ఈసారి బాక్సాఫీస్‌ వద్ద తప్పక గెలవాల్సిన అవసరం ఉంది. ‘పెద్ది’ తోనే తన కమ్‌బ్యాక్‌ను అద్బుతంగా అందుకోవాలని చూస్తున్నాడు.

మాస్ మసాలా ఎలిమెంట్స్‌తో నిండిపోనున్న ఈ సినిమాలో, ఇప్పటికే చర్చనీయాంశమైన ఐటమ్ సాంగ్ కూడా ఉండబోతోందని టాక్‌. అది కూడా శ్రీకాకుళం ఫోక్ టచ్ ఉన్న ఓ పక్కా మాస్ నెంబర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాటలో రామ్ చరణ్‌తో జత కట్టేది ఎవరు? అన్నదానిపై మీడియాలో పేర్లు వినపడుతున్నాయి కానీ, టీమ్ మాత్రం ఇంకా అధికారికంగా ఎవరినీ ప్రకటించలేదు.

మొదట, ‘హాపెనింగ్ సెన్సేషన్’ శ్రీలీల పేరు వినిపించింది. ఆ తర్వాత ‘కూలీ’ లో తన పాటతో వైరల్‌ అయిన పూజా హెగ్డే రేస్‌లోకి వచ్చింది. ఇప్పుడు టాప్‌ హీరోయిన్ సమంత కూడా ఈ రేస్‌లోకి వచ్చిందని టాక్‌. ఈ క్రమంలో ‘రంగస్థలం’ తర్వాత రామ్ చరణ్ – సమంత కాంబినేషన్ మళ్లీ వస్తుందా? అన్న ఆసక్తి పెరిగింది.

ఈ పాటపై భారీ అంచనాలు ఉండటంతో, బుచ్చి బాబు అండ్‌ టీమ్ హైప్‌ డబుల్‌ చేసేలా సరైన ఆన్‌స్క్రీన్ పార్ట్‌నర్‌ను ఫైనలైజ్‌ చేయడానికి పలు ఆప్షన్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఏ హీరోయిన్ అయినా ఫిక్స్ అయితే, ఈ స్పెషల్ సాంగ్‌పై మరింత బజ్ క్రియేట్‌ అవుతుందనడంలో సందేహం లేదు. అంతేకాక, ఈ హైప్‌ను మరింత పెంచేందుకు ఏఆర్ రహ్మాన్ అందిస్తున్న సౌండ్‌ట్రాక్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

, , , , , ,
You may also like
Latest Posts from