ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఓటిటి ప్రయాణం ఇప్పటికే పెట్టుకున్నాయి. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer ott)ఆల్రెడీ ఓటీటీకి వచ్చేసి దుమ్ము రేపుతోంది. ఇక వెంకటేష్ సూపర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఓటీటీ కన్నా ముందు టీవీలో ప్రసారం చేయనున్నట్లు జీ5 ఇప్పటికే ప్రకటించింది. దీంతో అందరి దృష్టి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj Ott) పైనే ఉంది. ఈ సినిమా ఓటీటీ ప్రకటన ఎప్పుడొస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ఓటిటి రిలీజ్ లేటు అవనుందని తెలుస్తోంది. మార్చి మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని టాక్. అందుకు కారణం ఏమిటి.
ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) సొంతం చేసుకుంది. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారని అందరూ అనుకున్నారు. అయితే, అలా జరిగే పరిస్దితి కనపడటం లేదు.
అందుకు కారణం హిందీ రిలీజ్ అని తెలుస్తోంది. హిందీలో రిలీజ్ చేస్తే అక్కడ ఎగ్రిమెంట్ ప్రకారం సినిమా విడుదలైన రోజు నుంచి 50 రోజులు పూర్తయిన తర్వాతే ఓటీటీకి (daaku maharaaj ott release date) తీసుకురావాలన్నది రూల్. అక్కడ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిబంధనను చిత్ర టీమ్ పక్కాగా అమలు చేయాలని భావిస్తోంది.
అలాగే, ఓటీటీలో తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారు. ప్రస్తుతం ఇతర భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ దేఓల్, ప్రజ్ఞా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని నాగవంశీ నిర్మించారు.