తెలుగుసినిమా వార్తలు

“ఆంధ్ర కింగ్ తాలూకా” కలెక్షన్స్ అంత దారుణమా?

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నుంచి భారీ ఆశలు పెట్టుకున్న సినిమా “ఆంధ్ర కింగ్ తాలూకా” నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదలైంది. కానీ రిలీజ్‌తోనే షాకింగ్ సన్నివేశం…

మొదటి రోజే వసూళ్లు నీరసంగా… మిక్స్‌డ్ టాక్‌తో రామ్ కలలే కూలిపోయాయా?

సినిమాకు మొదటి రోజున వచ్చిన టాక్ మిక్స్‌డ్. దాంట్లో భాగంగా వసూళ్లు కూడా అంచనాలకు దూరంగా సాగాయి.

మొదటి రోజు కలెక్షన్స్ కేవలం ₹4 కోట్లు మాత్రమే…వీకెండ్‌లో కొంచెం పికప్ అయినా చెప్పుకోదగ్గ స్థాయిలో లిఫ్ట్ కాలేదు.

మూడూ రోజులు పూర్తయ్యేసరికే:
వరల్డ్ వైడ్ గ్రాస్: ₹16.5 కోట్లు
నెట్ కలెక్షన్స్: ₹10 కోట్లు దాటింది

ఇవన్నీ చూసినప్పుడు ఒక విషయం క్లియర్ — రామ్ హీరోయిజం కూడా ఈసారి థియేటర్లను లేపలేకపోయింది.

బ్రేక్ ఈవెన్ హర్డిల్: 50 కోట్ల గ్రాస్ కావాలి… దరిదాపుల్లో కూడా కనపడటం లేదు! దీంతో మైత్రి మూవీ మేకర్స్ వర్గాలు వసూళ్లపై తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు టాక్.

USA ప్రమోషన్స్ కూడా లిఫ్ట్ ఇవ్వలేకపోయాయా?

రామ్, భాగ్యశ్రీ బోర్సే USAలో ప్రమోషన్ చేస్తున్నా… అక్కడ కూడా ఫుట్‌ఫాల్స్ అవరేజ్ గానే ఉన్నాయని సమాచారం.

ఏదైమైనా రామ్ గత మూవీలతో పోలిస్తే ఇది బెటర్ ఫిల్మ్. కానీ మనీ స్పిన్నర్‌గా మారలేదు. బజ్ లేకపోవడం, మిక్స్‌డ్ రివ్యూస్, పోస్ట్-పాన్ ఇండియా హైప్ లేకపోవడం కలసి పనిచేయలేదని విశ్లేషకుల అభిప్రాయం

ఇక రాబోయే వర్క్‌డేస్‌నే సినిమా ఫేట్ నిర్ణయించబోతుంది. సెకండ్ వీకెండ్‌లో మిరాకిల్ జరిగితేనే రామ్‌కి రిలీఫ్!

Similar Posts