యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘డ్రాగన్’ (ప్రశాంత్ నీల్ దర్శకత్వం) షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. ఇందుకు కారణం ఆయన ఫుల్ ఫోకస్ ఇప్పుడు బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ ‘వార్ 2’ ప్రమోషన్‌లపైనే పెట్టడమే.
ఆగస్టు 14న విడుదల కాబోతున్న ‘వార్ 2’ దేశవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో ఎన్టీఆర్ పాత్ర కీలకంగా మారింది. ఇది ఎన్టీఆర్ హిందీలో తొలి చిత్రం కావడం, ఆయనకు ఉత్తర భారతదేశంలో ఉన్న క్రేజ్ పెంచే అవకాశం కావడం వల్ల, ఫిల్మ్ పబ్లిసిటీకి ఆయన ప్రమోషన్లు ఎంతో కీలకం అనే అభిప్రాయంలో మేకర్స్ ఉన్నారు.
ఈ నేపథ్యంలో, ఆగస్టు 2 నుంచి ముంబైలో ఎన్టీఆర్ ప్రోమోషన్ టూర్‌ను ప్రారంభించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, రజనీకాంత్ ‘కూలీ’ వంటి సినిమాతో బాక్సాఫీస్‌లో ఎదురుదెబ్బలు తగిలే ప్రమాదం ఉండటంతో, ఎన్టీఆర్ ప్రెజెన్స్‌ను బలంగా వాడుకునేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.
ఇదిలా ఉండగా, తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను నాగవంశీ సొంతం చేసుకున్నారు. తెలుగు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఆయన – “ఇంకా సమయం ఉంది, తెలుగులో ప్రమోషన్లు పెద్ద స్థాయిలో చేపడతాం. ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన పనిలేదు” అంటూ సూచించారు.
ఇప్పటికి ‘డ్రాగన్’ ప్రాజెక్టు పక్కకు స్లోడ్ అవ్వగా, ఎన్టీఆర్ దృష్టంతా ‘వార్ 2’పై కేంద్రీకరించబడింది. హిందీ తెరపై తన తొలి అడుగు ఎంత పెద్దగా వేస్తాడో చూడాలి!