విజయ్ దేవరకొండ తాజా చిత్రం “కింగ్‌డమ్” థియేటర్లలోకి విడుదలకు మూడు రోజులే మిగిలుండడంతో, అభిమానుల్లో టెన్షన్‌తో పాటు తిన్న హైప్ నెలకొంది. సినిమా ట్రైలర్‌కు వచ్చిన స్పందన, అడ్వాన్స్ బుకింగ్స్‌కి వస్తున్న బజ్ చూసినవారికి ఒకే సందేహం — “ఇది హిట్ 3 డే 1 రికార్డును బ్రేక్ చేస్తుందా?”
అందులోనూ ఇండస్ట్రీలో టైర్-2 హీరోస్ లో Vijay Deverakonda vs Nani అనే పోటీ చాలాకాలంగా నడుస్తోంది. నానీకి గతంలో వచ్చిన HIT: The Third Case ఒక సెన్సేషన్ అయింది. ఫ్రాంచైజీ ఫాలోయింగ్, హాలీడే బెనిఫిట్, నానీకి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ అన్నీ కలిసి ఆ సినిమాను టియర్-2 హీరోలలో హయ్యెస్ట్ డే 1 ఓపెనింగ్ వరకూ తీసుకెళ్లాయి – దాదాపు ₹40 కోట్లు గ్రాస్ సాధించి.
ఇప్పుడు అదే స్థాయిలో ఓపెనింగ్ సాధించే ఛాలెంజ్ విజయ్ దేవరకొండ ముందు ఉంది. “కింగ్‌డమ్” ట్రైలర్ విడుదలకుముందు ఈ ఛాలెంజ్ పెద్దదిగా కనిపించింది. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. ఇంటర్నేషనల్ బుకింగ్స్, మల్టీప్లెక్స్ అడ్వాన్స్ బుకింగ్స్—all pointing in one direction: Positive Buzz!
ఈ సినిమాకి WOM (Word of Mouth) క్లీన్‌గా వచ్చేసిందంటే, ‘కింగ్‌డమ్’ HIT 3 రికార్డును చెరిపేసే ఛాన్స్ ఉంది.
ఇక మూడు రోజుల్లో తేలిపోతుంది—విజయ్ దేవరకొండ కింగ్‌గా తలెత్తుతాడా? లేక నాని రికార్డు ఇంకా మిగిలిపోతుందా?
మీ అభిప్రాయం ఏంటి? కింగ్‌డమ్ డే 1 వసూళ్లు హిట్ 3ని అధిగమిస్తాయా?