తెలుగు సినిమా అభిమానుల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్ ! అదేమిటంటే నాగార్జున – సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదుట స్టైలిష్ విలన్‌గా కూలీలో ఎంట్రీ ఇస్తున్నారు. కానీ ఆ పాత్రను అంత స్ట్రాంగ్ గా డిజైన్ చేసాడా అని.

లోకేష్ గత సినిమాలు చూస్తే… మాస్టర్, విక్రమ్ లలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ స్టార్ట్‌లో బలంగా డిజైన్ చేసినా క్లైమాక్స్‌కి వచ్చేసరికి హీరో ముందు తేలిపోయింది. లియోలో సంజయ్ దత్, అర్జున్ రోల్స్ ప్రారభం నుంచే బలహీనంగా రాసారు – అంతే కాదు, సంజయ్ దత్ కూడా పబ్లిక్‌గా తన రోల్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇప్పుడు కూలీలో కూడా అదే రిపీట్ అవుతుందేమో అని నాగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్. తాజాగా వచ్చిన కుబేరాలో న్యూట్రల్ ఆడియన్స్ నాగ్ నటనపై ఫిదా అయినా, ఫ్యాన్స్ మాత్రం సెకండ్ హాఫ్‌లో ధనుష్ డామినేషన్ వల్ల బాగా నిరాశ చెందారు. అదే ట్రాక్ కూలీలోనూ వస్తే… ఫ్యాన్స్‌కి మిగిలేది ఫ్రస్ట్రేషన్ మాత్రమే.

పాజిటివ్ వైపు చూస్తే, లోకేష్ నాగ్‌కి ఇచ్చిన సైమన్ లుక్, అటిట్యూడ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యింది. కానీ అసలైన టెస్ట్ స్క్రిప్ట్‌లోనే ఉంది. హీరో – విలన్ బ్యాలెన్స్ మైంటైన్ చేస్తారా? నాగార్జున రోల్ చివరి ఫ్రేమ్ వరకూ పవర్‌గా నిలబడుతుందా?

ఒక విషయం మాత్రం క్లియర్ – తెలుగు స్టేట్స్‌లో కూలీ సక్సెస్ కేవలం రజినీ స్టైల్ మీదే కాకుండా, నాగ్ విలన్‌గా ఎంత స్ట్రాంగ్‌గా నిలుస్తాడో దానిపైనే ఆధారపడి ఉంది.

, , , , , ,
You may also like
Latest Posts from