టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ – “పెద్ద నిర్మాతలకు అసలు బుద్ధి ఇన్నాళ్లకు వచ్చిందా?” అని. హిందీ డబ్బింగ్ మార్కెట్ ఓ టైమ్ లో బంగారు గని… ఇప్పుడు తవ్వినా మామూలు రాయి కూడా రాదు. సాటిలైట్ రైట్స్? వీధి బజార్‌లో సేల్ పెట్టినట్టు విలువ పూర్తిగా పడిపోయింది. ఇక OTTలు? వాళ్లు పెద్ద హీరో సినిమాలకే పూల దారి పరుస్తున్నారు, మిగతావాళ్లకు “నెక్ట్స్ టైమ్ సార్” అంటున్నారు.
అయితే ఇది అంతా ఎవరి తప్పు? ప్రొడ్యూసర్లే చెబుతున్నారు – “మా మూర్ఖత్వం” అని!
దిల్ రాజు ఓపెన్‌గా ఒప్పేసుకున్నాడు – “మేం OTT బూమ్‌కి బలి అయ్యాం. ముందు చూపు లేకుండా దానిపైనే ఆశలు పెట్టుకున్నాం. ఇప్పుడు వాళ్లు చిన్న సినిమాలకు గేటు మూసేశారు,” అని.
మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని కూడా అదే మాట ఓపెన్ గా అనేసారు – “OTT డీల్ క్లోజ్ చేయడం చాలా చాలా కష్టంగా మారిపోయింది. మళ్లీ థియేటర్ బిజినెస్‌కే పెంచాలి,” అని తేల్చేశారు.
ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఫైర్ – “ఓటిటి గురించి ఇంతకాలానికి అర్దమైందా, ఇంతకాలం మీవి బిజినెస్ మైండ్స్ అనుకున్నాం, ఇప్పుడు పబ్లిక్‌గా బుద్ధి వచ్చిందని అని ఒప్పుకుంటున్నారా?” అని కామెంట్లు జల్లు కురిపిస్తున్నారు.
టాలీవుడ్‌లో ఇదే కొత్త ట్రాక్ – OTT కలలు కూలి, థియేటర్ రూట్‌కి రివర్స్ గేర్. కానీ జనాలు డౌట్ – “ఈ సారీ కూడా అదే పాత తప్పులు మళ్లీ చేస్తారా?”