వైవాహిక జీవితంలో క్రైసిస్ వచ్చినప్పుడు సెలబ్రిటీలకు ఓ “హిట్ ఫార్ములా” ఉన్నట్లే కనిపిస్తోంది – ఇన్‌స్టాగ్రామ్ క్లీనప్! గత కొన్ని రోజులుగా నటి హన్సిక మోత్వానిని చుట్టుముట్టిన విడాకుల వార్తలకు తాజాగా ఓ కొత్త మూమెంట్ దొరికింది. తన పెళ్లికి సంబంధించి ఎన్నో పోస్ట్‌లు హన్సిక తన ఇన్‌స్టా పేజీ నుండి తొలగించడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
ఇంతకాలం పెళ్లి ఫొటోలతో, వీడియోలతో మెరిసిపోతున్న ఆమె పేజ్‌లో ఇప్పుడు కొన్ని క్లిప్‌లు మాత్రమే మిగిలాయి. మిగతావన్నీ మాయమయ్యాయంటే… “ఏం జరుగుతోంది?” అన్న అనుమానం తప్పదు.
హన్సిక, సోహైల్ కతూరియా జంట 2022 డిసెంబర్ 4న జైపూర్‌లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఆ వేడుకల చిత్రాలు అప్పట్లో వైరల్ అయినా, ఇప్పుడు వాటిలో చాలా డిలీట్ చేయబడటంతో వారి రిలేషన్‌పై మరోసారి షేడో పడింది.
ఇకపై మరింత చర్చకు తావిచ్చిన విషయం ఏంటంటే – గత రెండు వారాలుగా హన్సిక సోషల్ మీడియాలో పూర్తి మౌనం పాటిస్తోంది. సెలెబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ నుంచి దూరంగా ఉండటం అంటే నిజంగానే ఇన్స్టా క్లూస్ ఇవ్వడం కాదా?
ఇక ఆమె ప్రస్తుతం తల్లి దగ్గరే ఉంటోందన్న ప్రచారం కూడా వాస్తవమేనని కొంతమంది ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కానీ హన్సిక నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఆ ఊహాగానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
చిన్న వయసులోనే నటన ప్రారంభించిన హన్సిక, ‘దేశముదురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తరువాత తమిళ, తెలుగు చిత్రాల్లో స్థిరపడుతూ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది. కానీ వ్యక్తిగత జీవితం మాత్రం ఇప్పుడే క్లౌడ్ కిందకి వస్తోందా అన్నది పెద్ద ప్రశ్న.
ఇన్స్టాలో పోస్ట్‌లు తొలగించడం ఓ పర్శనల్ ఛాయిస్ కావొచ్చు. కానీ సెలెబ్రిటీల విషయంలో… అదే ఓ పబ్లిక్ స్టేట్మెంట్‌గా మారిపోవడం ఎప్పుడూ జరగుతోంది!
చెప్పకుండా చెప్పే కథలు… ఇన్‌స్టాలో కనిపించకుండా పోయే పోస్టుల్లోనే దాగి ఉంటాయేమో!