

భారతీయ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఏమిటీ అంటే మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 . అనౌన్స్ చేసిన రోజునుంచే ఈ సినిమా చుట్టూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల మహేశ్ బాబు ప్రీ-లుక్ పోస్టర్ బయటకొచ్చిన తర్వాత క్రేజ్ మరింత పెరిగింది.
కానీ ఇప్పుడు ఈ సినిమా చుట్టూ కొత్త చర్చ మొదలైంది. అదే బడ్జెట్!
800 కోట్లు నుంచి 1200 కోట్ల వరకు… ఎలా మారింది లెక్క?
ఈ సినిమా ఖర్చు రూ.800 కోట్లు అవుతుందని కొంతకాలంగా టాక్ వినిపిస్తోంది. కానీ కెన్యా షూటింగ్ సందర్భంగా, అక్కడి మీడియా రిపోర్ట్ ఒక్కసారిగా బాంబ్ వేసింది – ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ రూ.1200 కోట్లు అని!
ఇది కేవలం సంఖ్య కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వినిపించని ఫిగర్. గత లెక్కలతో ఓ సారి పోల్చి చూస్తే..
రాజమౌళి గత మాస్టర్‌పీస్ బాహుబలి (1+2) కలిపి ఖర్చు దాదాపు రూ.500 కోట్లు.
రీసెంట్‌గా హాట్ టాక్‌లో ఉన్న అల్లు అర్జున్ – అట్లీ సినిమా రూ.700 కోట్ల బడ్జెట్‌తో అనౌన్స్ అయింది.
కానీ SSMB29 కు 1200 కోట్లు అంటే… ఈ రెండు భారీ ప్రాజెక్ట్‌ల కలిపిన బడ్జెట్ కంటే ఎక్కువ.
ఇక్కడే ప్రశ్నలు మొదలవుతున్నాయి. నిర్మాత సామర్థ్యం – ఇక్కడ డౌట్ లేదు
ఈ సినిమాను కే. ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఆయన 2006లో జూనియర్ ఎన్టీఆర్ “రాఖీ” తర్వాత సినిమాలు చేయలేదు. కానీ ఆయన హైదరాబాద్, విజయవాడలో బలమైన రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. కాబట్టి డబ్బు వెనకడగు వెయ్యరనేది నిజం. ఆ స్దాయి స్తోమత ఉంది.
అయితే ఒకే సినిమా కోసం ఇంత బడ్జెట్ పెట్టడం ప్రాక్టికల్‌గా సెన్స్ చేస్తుందా? అనేది అసలు కన్‌ఫ్యూజన్.
రెండు భాగాల ప్లాన్ ఉందా?
ఇండస్ట్రీలో మరో అనుమానం – ఈ సినిమా రెండు భాగాలుగా ప్లాన్ చేయబడి ఉండొచ్చని. అలా అయితే 1200 కోట్ల లెక్క అర్థమవుతుంది. కానీ ఒక్క భాగానికి మాత్రమే అయితే, ఈ లెక్క అతిశయోక్తిగా కనిపిస్తోంది.
ఇంటర్నేషనల్ లొకేషన్లు – ఖర్చు పెరుగుతుంది కానీ…
కెన్యా లాంటి ఆఫ్రికన్ లొకేషన్లు, భారీ సెట్ వర్క్, స్టార్ కాస్టింగ్ (మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్) – ఇవన్నీ కలిపితే ఖర్చు తప్పక పెరుగుతుంది. కానీ 1200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం ఎంత అన్నదే ప్రధాన ప్రశ్న.
కాకపోతే ఇప్పటిదాకా అధికారికంగా రాజమౌళి గానీ, నిర్మాత గానీ బడ్జెట్‌పై ఒక్క మాట కూడా చెప్పలేదు. కాబట్టి 1200 కోట్ల వార్త వాస్తవమా? లేక కేవలం బజ్ క్రియేట్ చేసే మీడియా గేమ్ మాత్రమేనా? అనే క్లారిటీ రావాల్సి ఉంది.
ఒకవేళ ఇది నిజమైతే, SSMB29 భారతీయ సినిమా చరిత్రలోనే కాక ఆసియా స్థాయిలో కూడా అత్యంత ఖరీదైన సినిమా గా నిలుస్తుంది.
కానీ ఇది కేవలం రూమర్ అయితే, మరొకసారి మనం తెలుసుకోవాల్సింది – హైప్ , వాస్తవం మధ్య గీత ఎక్కడ ఉందనేది.