పెద్ద సినిమాలు అంటే గతంలో స్టార్ పవర్, భారీ సెట్స్, మాస్ ఎలిమెంట్స్ మాత్రమే గుర్తుకొచ్చేవి. కానీ ఇప్పుడు సినిమా విజయం మేజర్‌గా ఆధారపడేది సీజీ – వీఎఫ్ ఎక్స్ షాట్స్ మీదే. అవే ఒక సినిమాకు లైఫ్ ఇస్తున్నాయి, అవే కొత్త లోకాలను చూపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తున్నారు. ఈ విషయంలోనే మిరాయ్ చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
హనుమాన్ తో 300 కోట్ల హిట్ కొట్టిన తేజ సజ్జ, ఈసారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భారీ బెట్ వేసిన మిరాయ్ తో వచ్చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కాగానే వచ్చిన స్పందన చూస్తే, గ్రాఫిక్స్‌నే సినిమా యొక్క హార్ట్‌గా డిజైన్ చేశారని క్లియర్‌గా అర్థమవుతోంది. ముఖ్యంగా గరుడ పక్షి విజువల్స్ ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేశాయి.
ఈ సినిమా కోసం స్పెషల్‌గా రూపొందించిన 1650 వీఎఫ్ ఎక్స్/సీజీ షాట్స్ ఉన్నాయట. ఇప్పటికే వాటిలో ఎక్కువ భాగం పూర్తయిపోయింది. మిగిలిన షాట్స్ మరో రెండు మూడు రోజుల్లో సిద్ధం కానున్నాయి. అవే ఫైనల్‌గా వచ్చాక సౌండ్ వర్క్ ముగించి, థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతుందని ఇండస్ట్రీ టాక్.
మిరాయ్ కథ కూడా ఈ విజువల్ ఎఫెక్ట్స్ కి తగ్గట్టే ఉంది – సృష్టిని కాపాడే తొమ్మిది గ్రంథాలు , వాటిని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించే దృష్ట శక్తి, దాన్ని అడ్డుకునే హీరో సాహసాలు. ఈ కాన్సెప్ట్‌కి వీఎఫ్ ఎక్స్ బలంగా సపోర్ట్ అవ్వడం వల్లే ట్రైలర్ ఇప్పటికే “ఇంటర్నేషనల్ లుక్” తో మెప్పిస్తోంది.
సెప్టెంబర్ 12 నుంచి థియేటర్లలో సందడి చేయబోతున్న మిరాయ్ , టాలీవుడ్ స్క్రీన్ పై మరో విజువల్ వండర్‌గా నిలుస్తుందని అభిమానులు నమ్మకం పెంచుకున్నారు.