రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌ జరిపింది. హోంబలే ఫిలిమ్స్ మునుపటిలాగే ఈసారి కూడా అడ్వాన్స్ బేసిస్ మీదే డీల్స్ క్లోజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల కలిపి అడ్వాన్స్ మొత్తం దాదాపు ₹90 కోట్లు చేరింది.

అంటే, ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కేజీఎఫ్ 2 స్థాయిలో షేర్ రావాల్సిందే. ఇది సాధ్యమవుతుందా అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆఫర్స్, బెనిఫిట్స్ బాగానే వచ్చాయి. టికెట్ రేట్లకు 10 రోజులు ప్రత్యేకంగా పెంపు ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్‌పై ₹75 + GST, మల్టీప్లెక్సుల్లో ₹100 + GST ఎక్స్‌ట్రా వసూలు చేసేందుకు అనుమతి లభించింది. దీంతో అక్కడ బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి.

తెలంగాణలో మాత్రం పరిస్థితి క్లారిటీ రాలేదు. ఇప్పటివరకు టికెట్ హైక్‌కు అవకాశమే లేదని టాక్ వినిపిస్తోంది. అయితే ప్రీమియర్ షోలకు అనుమతి కోసం టీమ్ వేచి చూస్తోందట. అందుకే బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ కాలేదు.

ఫైనల్ టేక్:
కాంతార చాప్టర్ 1కు తెలుగు రాష్ట్రాల్లో పెట్టిన భారీ బిజినెస్, ఇచ్చిన అడ్వాన్సులు ఇప్పుడు సినిమాకే లైఫ్ లైన్‌గా మారాయి. కానీ ఈ టార్గెట్ అందుకోవాలంటే సినిమా రివ్యూస్, వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్‌గా ఉండడమే కీలకం!

, , , ,
You may also like
Latest Posts from