హైదరాబాద్‌లోని ‘పెద్ది’ షూటింగ్ సెట్‌లో ఒక్కసారిగా నిశ్శబ్దం, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుదుటిపై రక్తం చుక్కలు చూడగానే యూనిట్ అంతా షాక్‌కు గురైంది! అసలు ఆ క్షణం అక్కడ ఏం జరిగిందో తెలిస్తే అభిమానుల గుండె ఆగినంత పనవుతుంది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ , బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమా క్లైమాక్స్ దశకు చేరుకున్న తరుణంలో , షూటింగ్ స్పాట్‌లో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

నేడు హైదరాబాద్‌లో జరుగుతున్న ‘పెద్ది’ షూటింగ్‌లో ఒక కీలకమైన ఫైట్ సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో జరిగిన పొరపాటు వల్ల రామ్ చరణ్ నుదుటిపై గాయాలయ్యాయి. చరణ్ నుదుటిపై గీసుకుపోవడంతో వెంటనే చిత్ర యూనిట్ చికిత్స అందించింది. అయితే , అదృష్టవశాత్తూ ఇది పెద్ద ప్రమాదం కాదని , చరణ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారని సమాచారం అందుతోంది.
ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ ఒక మల్టీ టాలెంటెడ్ స్పోర్ట్స్ మ్యాన్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ దాదాపు పూర్తయింది. మరోవైపు , వచ్చే నెలలో మృణాల్ ఠాకూర్‌తో కలిసి ఒక స్పెషల్ ఐటెం సాంగ్‌ను ప్లాన్ చేశారు. ఈ గాయం కారణంగా షూటింగ్‌కు ఏమైనా బ్రేక్ పడుతుందా అన్న ఆందోళనలో ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రస్తుతానికి చరణ్ ఆరోగ్యం నిలకడగానే ఉండటం మెగా అభిమానులకు ఊరటనిచ్చే విషయం. ఏదేమైనా ‘పెద్ది’ సినిమాను ఏప్రిల్ 30, 2026న విడుదల చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. మెగా పవర్ స్టార్ త్వరగా కోలుకోవాలని , మళ్ళీ సెట్స్‌లోకి అడుగుపెట్టాలని మనం కూడా ఆశిద్దాం.

