నెగిటివిటిని ఓ విషయమై స్ప్రెడ్ చేయాలంటే సోషల్ మీడియాని మించిన ఆయుధం లేదు. ఈ నెగిటివిటికి సినిమా వాళ్లు చాలా సార్లు బలై పోతున్నాయి. ఏదన్నా పెద్ద సినిమా రిలీజైతే యాంటి ఫ్యాన్స్  ఓ రేంజిలో రెచ్పిపోయి నెగిటివ్ క్యాంపైన్ లు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు అది సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది.

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కు ముందు మంచి హైప్ క్రియేట్ చేయగలిగింది. 

అదే సమయంలో  ఇండియన్ 2 ఎఫెక్ట్ తో శంకర్ పై అనుమానం తో ఉన్న ఫ్యాన్స్ కు ట్రైలర్ నమ్మకం కలిగించింది.  అయితే శుక్రవారం విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.

రిలీజ్ రోజు ఓపినింగ్స్ అదిరిపోయేలా  హౌస్ ఫుల్స్ పడ్డాయి.  కానీ మౌత్ టాక్ సరిగ్గా లేదు.

గేమ్ ఛేంజర్ కు  రివ్యూలు కూడా అంతగా పాజిటివ్ గా రాలేదు. ఇదే అవకాశంగా కొందరు సోషల్ మీడియా జనం తీసుకుని సినిమాపై విషం చిమ్ముతున్నారు.

ట్రోల్ చేస్తున్నారు. రకరకాల వీడియోలు వైరల్ చేస్తున్నారు. సినిమాకు వెళ్దామనుకునే వారికి సైతం ఆసక్తి చంపేసేలా ఆ వీడియోలు ఉంటున్నాయి.

ముఖ్యంగా ఎన్టీఆర్, అల్లు అర్జున్ అభిమానులు అయితే అదే పనిగా గేమ్ ఛేంజర్‌ను ఆడుకుంటున్నారు.

దీనికి తోడు మొదటి రోజు హెచ్ డీ ప్రింట్‌తో సినిమా పైరసీ సైట్ లో  లీక్ అయ్యి మరో దెబ్బ కొట్టింది. 

,
You may also like
Latest Posts from