కొన్ని సినిమాలు హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ తో వార్తల్లో నిలిస్తే మరికొన్ని సినిమా పెట్టుబడిలో పావు వంతు కూడా తెచ్చుకోలేక డిజాస్టర్ అయ్యి రికార్డ్ లు క్రియేట్ చేస్తాయి. అలా ఇప్పుడు ప్రపంచం అంతా చెప్పుకుంటున్న సినిమా బెటర్ మ్యాన్ మూవీ. ఇప్పుడంతా ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది.
దర్శకుడు మైఖేల్ గ్రేసీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.950 కోట్లతో రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం రూ.130 కోట్లు మాత్రమే వసూళు చేసి రూ.800 కోట్లకు పైగా నష్టాన్ని మిగిల్చింది.
ఇంతకీ ఈ సినిమా దేని గురించి
ఈ చిత్రం బ్రిటిష్ నంబర్ వన్ మ్యూజికల్ ఆర్టిస్ట్ రాబీ విలియమ్స్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. అతడు మరెవరో కాదు.. 30 ఏళ్ల క్రితం ఒక రోజులో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసిన ఆర్టిస్టు. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి.. కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. అతడి అన్ని ఆల్బమ్స్ కూడా నెంబర్ 1 ర్యాంకు అందుకున్నాయి.
జనవరి మొదట్లో విడుదలైన ఈ ‘బెటర్ మ్యాన్’ మూవీ 2025లో తొలి డిజాస్టర్‌గా నిలిచింది. ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీలో ఆర్టిస్ట్ రాబీ విలియమ్స్ పాత్రలో ఒక మనిషి కాకుండా.. చింపాంజీ నటించడం గమనార్హం.
గతేడాది లాస్ట్‌లో కొన్ని థియేటర్లలోనే ఈ సినిమాను ప్రదర్శించారు. అలాగే ఈ చిత్రం బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్స్‌కు కూడా నామినేట్ అయింది. దీంతో ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయ్యింది.