బాలయ్యకు పద్మ భూషణ్ వచ్చిన నేపథ్యంలో..ఎన్టీఆర్‌ ట్వీట్‌ వైరల్‌ అయింది. బాల బాబాయ్ కు పద్మ భూషణ్ పురస్కారం రావడం సినిమారంగానికి, ప్రజా సేవకు ఆయన చేసిన ఎనలేని కృషికి గుర్తింపు అన్న జూ. ఎన్టీఆర్.. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్‌ పెట్టారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీరంగంలో విశేషమైన సేవలు అందించినందుకుగానూ నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ అవార్డ్ ప్రకటించింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.

అలాగే బాలకృష్ణ సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్ వంటి స్టార్స్ బాలయ్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్స్ చేశారు.

“ప్రతిష్టాత్మక పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన బాల బాబాయ్ కు హృదయపూర్వక అభినందనలు. ప్రజాసేవకు, సినిమా రంగానికి మీరు చేసిన ఎనలేని సేవలకు గుర్తింపుగా దక్కిన గౌరవం” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

“ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్న నా బాబాయ్ నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ సన్మానం సినిమా ప్రపంచానికి మీరు చేసిన విశేషమైన సేవలకు మరియు సమాజానికి సేవ చేయడంలో మీ నిర్విరామ కృషికి నిజమైన గుర్తింపు.” అంటూ కళ్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.

కాగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రాలకు మొత్తం 7 పద్మ అవార్డులు వచ్చాయి. అందులో పద్మ విభూషణ్ 1, పద్మభూషణ్ 1 అలాగే 5 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అయితే పద్మ అవార్డులు ఎవరికీ వచ్చాయో చూస్తే.. డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ వైద్యంలో ఇచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణకు కళారంగంలో పద్మభూషణ్ ఇచ్చారు.

#Bala Krishna, #NTR, #Padma Awards

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *