అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’ వచ్చే వారం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి పీరియాడిక్ నేపథ్యంలో ఓ చక్కటి లవ్ స్టోరీ మూవీగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. నిర్మాతలు సైతం ఈ సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా స్టార్స్ తో ఈ సినిమా ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు సమాచారం.
‘తండేల్’ సినిమా ట్రైలర్ లాంచ్ చెన్నైలో రేపు జరగనుంది. ఈ ఈవెంట్ కు తమిళ నటుడు కార్తీ రానున్నారు.
శుక్రవారం ‘తండేల్’ చిత్రం హిందీ ట్రైలర్ ఈవెంట్ ని ముంబైలో ప్లాన్ చేసారు అమీర్ ఖాన్ ఈ ఈవెంట్ కు వస్తున్నారు.
ఈ వీకెండ్ లో భారీగా ‘తండేల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచంర.
‘తండేల్’ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ కావడంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా కథ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది.
‘తండేల్’ చిత్రానికి టైటిల్ కార్డ్స్, యాడ్స్ కలుపుకుని 2 గంటల 32 నిమిషాల నిడివి ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
‘తండేల్’ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.