సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప-2 ది రూల్ ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేసింది. దాంతో వరల్డ్ వైడ్ గా భాషా భేధం లేకుండా ఈ సినిమాని సినీ ప్రేమికులు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ వైరల్ అవుతోంది. ఈ సీన్ గురించి సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. రిలీజ్ అయ్యినప్పుడు పెద్దగా పట్టించుకోని జనం ఇప్పుడు ట్వీస్ట్ వేస్తూ, ఇనిస్ట్రాలో ఈ క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నారు.
పుష్ప-2 తాజాగా ఓటీటీకి వచ్చేసింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అదనంగా యాడ్ చేసిన సన్నివేశాలను ఓటీటీలో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్‌కు కల్పించారు. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఓటీటీలో పుష్ప-2 చూసి ఎంజాయ్ చేస్తున్నారు.
ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ రప్పా రప్పా గురించి సోషల్ మీడియా జనం తెగ చర్చించుకుంటున్నారు. గాల్లో తేలుతూ అల్లు అర్జున్ ఫైట్ చేసిన సన్నివేశాలైతే ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని పోస్ట్ లు పెడుతున్నారు. దాంతో ఈ సీన్ వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతోంది.
గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతంలో ఎప్పుడులేని విధంగా పలు రికార్డులను తిరగరాసింది.
బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన పుష్పరాజ్ ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది.