పవన్ కల్యాణ్ కమిటై బాగా లైటవుతున్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఒకటి. ఈ సినిమా ఇప్పటికే క్లైమాక్స్ దశకు చేరుకోగా.. మిగిలిన షూటింగ్ ను దర్శకుడు జ్యోతికృష్ణ పూర్తి చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్. బాబీ దేవోల్ (Bobby Deol)విలన్ పాత్ర పోషిస్తున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఈ చిత్రం షూట్ పూర్తవటానికి ఏకైక అడ్డం పవన్ డేట్స్. అవి మాత్రం దొరకటం లేదట. ఇలా పవన్ ఎందుకు చేస్తున్నాడనేది ఎవరికి అర్దం కావటం లేదట.
ఈ చిత్రం నుంచి ఇప్పటికే మొదటి పాట ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా నుంచి రెండో పాటను బయటకు వదిలేందుకు చిత్ర టీమ్ సన్నాహాలు చేస్తోంది.
‘‘కొల్లగొట్టినాదిరో..’’ అంటూ సాగే ఆ లవ్ సాగ్ ని ఈనెల 24న విడుదల చేయనున్నట్లు ప్రేమికుల రోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను నెట్టింట పంచుకుంది. అందులో పవన్ – నిధి రొమాంటిక్ లుక్‌లో కనిపించారు.
పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో పవన్ ఓ యోధుడిగా అలరించనున్నారు.
పంచమి అనే యువరాణిగా నిధి కనువిందు చేయనుంది.
ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో మార్చి 28న విడుదల కానుంది (Hari Hara Veeramallu Release Date).
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస.