ఒకప్పటి అందాల తార శ్రీదేవి కుమార్తె బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ లో సెటిల్ అవ్వటానికి రంగం సిద్దం చేసుకుంటోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ తో చేసిన దేవరతో సౌత్ లో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది. ఆ సినిమాకు తెలుగుతో పాటు హిందీలోనూ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని క్రేజ్, ఒక్క దేవర తో వచ్చేసింది. దాంతో ఇప్పుడు ఆమె సౌత్ ఇండస్ట్రీపై ఫుల్ ఫోకస్ చేస్తోంది.
ప్రస్తుతం బుచ్చిబాబు- చరణ్ కాంబోలో వస్తున్న సినిమా చేస్తోంది. ప్రెజెంట్ ఈ సినిమా సెట్స్ పై ఉంది. అలాగే ఇప్పుడు ఆమె మరో తెలుగు సినిమా క్రేజీ ప్రాజెక్ట్ సైన్ చేయబోతోందని సమాచారం. ఆ సినిమా మరోదో కాదు బన్నీ – అట్లీ కాంబోలో హై-ఆక్టేన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందబోయే ప్రాజెక్టు.
అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ ఫిక్స్ అయ్యిందని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.
ఇప్పటికే ‘ఆర్సీ 16’లో భాగమైన ఈ అమ్మడు, ఇప్పుడు బన్నీతో రొమాన్స్ చేయనుంది అనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇదిలా ఉండగా తంగలాన్ తో విక్రమ్ ఖాతాలో ప్లాప్ వేసిన పా రంజిత్ తో వర్క్ చేయబోతుందని చెన్నై సినీ వర్గాలలో టాక్ నడుస్తోంది. అదీ కూడా వెబ్ సిరీస్ చేస్తుందని టాక్. నెట్ ఫ్లిక్స్ కోసం ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడట పా రంజిత్. దీనిపై జాన్వీ, పా రంజిత్ మధ్య చర్చలు నడిచాయని టాక్.
ఇవే కాకుండా బాలీవుడ్ లో సన్నీ సంస్కారీ కి తులసి కుమారి, పరమ్ సుందరి చేస్తోంది.