అజిత్ కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘పట్టుదల’. తమిళంలో తెరకెక్కిన ‘విడాముయ‌ర్చి’కి తెలుగు డబ్బింగ్ ఇది. ఇందులో త్రిష హీరోయిన్. యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా ప్రధాన పాత్రలు పోషించారు. మగిళ్ తిరుమేని దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించారు. ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. దాంతో ఇప్పుడా సినిమా ఓటిటిలోకి ముందుగానే వచ్చేస్తుందని తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా పిభ్రవరి 28న ఓటిటిలోక వస్తోంది. అదే జరిగితే మూడు వారాల్లోనే ఓటిటిలోకి వచ్చేసినట్లు.

అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ ‘బ్రేక్ డౌన్’ ఆధారంగా ‘పట్టుదల’ (విడాముయ‌ర్చి) తెరకెక్కింది.

అజిత్ యాక్షన్ పరంగా ఎప్పటిలా బాగా చేశారు. అయితే, అజిత్ యంగ్ లుక్ మాత్రం అందరికీ సర్‌ప్రైజ్‌. చాలా బావుంది. అజిత్ హ్యాండ్సమ్‌గా ఉన్నారు. త్రిష తన పాత్ర పరిధి మేరకు చేశారు.

, , , ,
You may also like
Latest Posts from