గత ఏడాదిలో విడుదలైన ఇండియన్‌ 2 మూవీ భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో అత్య‌ధిక న‌ష్టాల‌ను మిగిల్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచిన సంగతి తెలిసిందే. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్‌) వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దీంతో క‌మ‌ల్‌హాస‌న్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన ఇండియ‌న్ 2 బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

తెలుగులో కూడా భార‌తీయుడు 2 చిత్రం 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రిక‌ల్ ర‌న్‌లో ప‌ద‌మూడు కోట్లు మాత్రమే క‌లెక్ష‌న్స్ అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను ఎదుర్కొంది. ఈ నేపధ్యంలో అసలు ఈ సినిమాకు పార్ట్ 3 ఉంటుందా ఉండదా అని చాలా మందికి సందేహం వచ్చేసింది. అయితే రీసెంట్ గా ఈ చిత్రం షూటింగ్ కు ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం శంకర్ …ఇండియన్‌–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఎనభై శాతం పూర్తి చేసారని, మిగిలిన ఇరవై శాతం సినిమాని మినిమం బడ్జెట్ లో తీసి రిలీజ్ చేయాలనే ఆలోచనలో శంకర్ ఉన్నారట. ఆ రకంగా అయినా నష్టాలు నుంచి కొద్దో గొప్పో బయిటపడచ్చు అనే ప్లాన్ చేస్తున్నారట.

భారతీయుడు 3 చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని గతంలో శంకర్ చెప్పారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఆరు నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.

, , ,
You may also like
Latest Posts from