సంబంధించిన టీజర్ రీసెంట్‌గా విడుదల అయ్యింది. ఈ టీజర్ అసలు ఎవరూ ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ రోల్ అని చెప్పొచ్చు. RAW ట్రుథ్ RAW లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం డిఫరెంట్ గా ఉంది. అయితే అదే సమయంలో ఈ టీజర్ లో వాడిన డైలాగులు వివాదానికి దారి తీస్తున్నాయి.
చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ.. అంటూ ఒక ప్రాంతంలో శవాలు, ఆకాశంలో కాకులను చూపిన విధానం స్టన్ అయ్యేలా చేస్తోంది.
ఇక ఒక ధగడ్ వచ్చి.. జాతిల మొత్తం జోష్ తెచ్చిండు.. ఆట్.. అంటూ నాని ఇంట్రో గూస్ బంప్స్ ఇస్తోంది. కాకులను ఒకటి చేసిన ఒక లం** కొడుకు కథ.. అని చెప్పిన విధానం చూస్తుంటే సినిమాలో బలంగా ఏదో చెప్పబోతున్నాడు అని అనిపిస్తోంది. అయితే బలంగా చెప్పాలని తల్లిని తిట్టేలా డైలాగులు అవసరమేంటి అంటున్నారు ఓ వర్గం. హిట్ కోసం ఇంతకు దిగజారాలా అని విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియా జనం.
దర్శకుడు శ్రీకాంత్ ఒదెల తన గత సినిమా ‘దసరా’ తర్వాత మరింత పవర్‌ఫుల్ కాన్సెప్ట్‌తో ‘ది ప్యారడైజ్’ని రూపొందిస్తున్నాడు. మాస్ ఎలిమెంట్స్, రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లతో నాని పాత్రను పెంచే ప్రయత్నం చేశాడని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.