హర్ష్‌ రోషన్, శ్రీదేవి, ప్రియదర్శి, శివాజీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్‌’ (Court Movie). వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నాని (Nani) సమర్పణలో ఇది తెరకెక్కింది. చిన్న సినిమాగా నిర్మితమైన ఈ చిత్రం విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మంచి వసూళ్లతో ఇది దూసుకెళ్తోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్సైనట్లు వార్తలు వస్తున్నాయి.

అందుతున్న సమాచారం మేరకు ‘కోర్ట్‌’ (Court Movie) ఏప్రిల్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ‘కోర్ట్’ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ₹7 కోట్లకు దక్కించుకుంది, దాని శాటిలైట్, థియేట్రికల్ ఆదాయానికి ముందే సినిమా బడ్జెట్‌లో దాదాపు మూడు వంతులు కవర్ చేసింది.

కలెక్షన్స్ విషయానికి వస్తే… రెండు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న కోర్ట్ చిత్రం .. మూడో వారంలోనూ దుమ్మురేపుతోంది. వీకెండ్ , ఉగాది, రంజాన్ పండుగలను బాగానే క్యాష్ చేసుకుంది. గత శనివారం రూ.46 లక్షలు, ఆదివారం ఉగాది పండుగ నాడు రూ.1.03 కోట్లు, సోమవారం రంజాన్ నాడు రూ.65 లక్షలు అందుకుని వసూళ్ల మోత మోగించింది. ఇక 19వ రోజు మంగళవారం కోర్ట్ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. ఫెస్టివల్ సీజన్, వీకెండ్ ముగిసినా, టఫ్ ఫైట్‌లోనూ ప్రియదర్శి చిత్రం మంచి వసూళ్లు సాధించింది.

కోర్ట్‌ రూమ్‌ డ్రామాగా ఈసినిమా రూపొందింది. రామ్‌ జగదీశ్‌ దర్శకత్వం వహించారు. ఇందులో నటీనటులు ముఖ్యంగా శివాజీ యాక్టింగ్‌ అద్భుతంగా ఉందని సినీ ప్రముఖులు సైతం మెచ్చుకున్నారు. ఇండస్ట్రీకి మరో విలన్‌ దొరికారని నెటిజన్లు మాట్లాడుకున్నారు.

, ,
You may also like
Latest Posts from