ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ విడుదల తర్వాత గ్యాప్ తీసుకున్నారు. ఇన్నాళ్లూ ఆ సక్సెస్ ని ఆస్వాదించాడు, తన ఫ్యామిలీలో ట్రిప్ లు వేసాడు. కంటిన్యూ షెడ్యూల్స్ తర్వాత తీసుకున్న విశ్రాంతితో ఇప్పుడు రిలాక్స్ అయ్యి మళ్ళీ వరస పనుల్లో పడ్డారు. ఇప్పుడు కొత్త టార్చర్ మొదలైంది.

బన్నీ తన తదుపరి చిత్రం కోసం అట్లీతో ముందుకు వెళ్తున్నాడు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8 న అధికారిక ప్రకటన కోసం రంగం సిద్దం అవుతోంది. సన్ పిక్చర్స్‌కు చెందిన కళానిధి మారన్‌తో కీలక సమావేశం కోసం అల్లు అర్జున్ నిన్న స్పెషల్ ప్లైట్ లో చెన్నైకి వెళ్లారు. ఇంకా ఈ ప్రాజెక్టు నిమిత్తం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవలసి ఉందని, ఈ మీటింగ్ లో వాటికి తుదిరూపు ఇవ్వనున్నారు.

అల్లు అర్జున్, అట్లీ, మారన్ ప్రకటన వచ్చేలోపు మిగతా విషయాలు ఈ మీటింగ్ లో ఫైనల్ చేస్తారు. ఇంకా టైటిల్ పెట్టని ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని 2026 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందించనున్నారు. మరిన్ని వివరాలను అధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ప్రయత్నంలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారు.

,
You may also like
Latest Posts from