చాలా మంది సినిమాలను థియేటర్లలోనే చూడడమే ఇష్టమని చెప్తున్నా.. థియేటర్లకు మాత్రం రావడం లేదని పీవీఆర్‌ ఐనాక్స్‌ లిమిటెడ్‌ సీఈఓ గౌతమ్‌ దత్తా చెప్తున్నారు. అయితే ప్రేక్షకులను పెంచటం కోసం వాళ్లు రకరకాల ప్లాన్స్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే పీవీఆర్‌ ఐనాక్స్‌ పాస్‌పోర్ట్‌ పేరిట మంత్లీ పాస్‌ తీసుకొచ్చింది. అలాగే ఇప్పుడు థియేటర్ లో లిక్కర్ దొరికేలా ప్లాన్ చేస్తోంది.

సినిమా చూడటం అనేది ఒకప్పుడు కమ్యూనిటీ ఎక్సపీరియిన్స్ . ఒకే కథను, కథనాన్ని అనుభవిస్తున్న వ్యక్తుల గ్రూప్ తో నవ్వటం, భావోద్వేగాలను పంచుకోవడం, అదే క్షణాల్లో చప్పట్లు కొట్టడం, ఉత్సాహపరిచడం చేస్తూ మనమంతా ఏదో ఒక పెద్దదానిలో భాగమైనట్లు భావిస్తూ వచ్చాము.

అయితే, OTT ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదలతో, అలాంటి ఎక్సపీరియన్స్ తగ్గిపోయింది. ఫ్యామిలీతో కూర్చుని ఇంట్లోనే సినిమా చూడటం పెరిగింది. సినిమా 8 వారాల్లోపు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తుందని తెలిసి, జనం ఇప్పుడు థియేటర్‌లకు వెళ్లడం చాలా తగ్గించేసారు. ఇది థియేటర్ బిజినెస్ ని రెవిన్యూని దెబ్బ కొడుతోంది.

అందుకే మల్టీప్లెక్స్ దిగ్గజం PVR INOX బెంగళూరు మరియు గుర్గావ్‌లలో మద్యం లైసెన్సుల కోసం దరఖాస్తు చేసింది, దాని ప్రీమియం సినిమా అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఆమోదించబడినట్లయితే, ఈ చర్య సంస్థ ప్రపంచ విలాసవంతమైన సినిమా ట్రెండ్‌లకు అనుగుణంగా ఎంపిక చేసిన థియేటర్లలో ఆల్కహాలిక్ పానీయాలను అందించడానికి అనుమతిస్తుందని చెప్తున్నారు.

You may also like
Latest Posts from