సూపర్ స్టార్ రజనీకాంత్ నెక్ట్స్ లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా చిత్రం కూలీలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంకు ఆకాశమే హద్దుగా అంచనాలు ఉన్నాయి. ఆగస్ట్ 14, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రానుంది. కూలీ తర్వాత రజనీ జైలర్ 2లో నటించబోతున్నారు.

జైలర్ ఘన విజయం తర్వాత రజినీకాంత్ “జైలర్ 2” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ తో ఈ సినిమాలో మరింత యాక్షన్, వైలెన్స్ ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడు అనేది అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియాలో బజ్ ప్రకారం, చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ 2026 వేసవిలో తెరపైకి రావచ్చు. మేకర్స్ ఏప్రిల్ 2026 విడుదలను లక్ష్యంగా పెట్టుకున్నారనే మాట.

అంటే దాదాపు సంవత్సరం సమయం ఉంది. ఈలోగా డైరక్టర్ , మ్యూజిక్ డైరక్టర్ కలిసి ఈ సినిమాని ఎంతవరకూ చెక్కాలో అంతదాకా చెక్కుతారన్నమాట.

ఈ సారి రజినీకాంత్ యాక్షన్ సీక్వెన్సులు, కథనం మరింత హై పిచ్‌లో ఉండనున్నాయని తెలుస్తోంది. జైలర్ 1 సాధించిన విజయాన్ని అధిగమించే విధంగా ఈ సినిమా రూపొందుతుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

, , ,
You may also like
Latest Posts from