ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన కారు కోసం ఫ్యాన్సీ నంబర్ దక్కించుకోవటం హాట్ టాపిక్ గా మారింది.
ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో రూ. 7.75 లక్షలు చెల్లించి టీజీ09ఎఫ్0001 నంబర్‌ను సొంతం చేసుకున్నారు. బాలయ్య త్వరలోనే రిజిస్టర్ చేసుకోనున్న తన బీఎండబ్ల్యూ వాహనం కోసం ఈ నంబర్‌ను తీసుకున్నారు.
ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ- స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2’. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ క్రమంలో అప్డేట్ వినిపిస్తోంది. ఈ మువీ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మొదట, ఈ ఏడాది సెప్టెంబర్‌లో అఖండ 2 విడుదల చేయాలని భావించారు మేకర్స్. అయితే ఆ సమయం లోపు షూటింగ్, వీఎఫ్ఎక్స్ పూర్తి అయ్యే అవకాశం లేదని సమాచారం.
అందుకే ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోందని టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై మూవీ టీమ్ ఇప్పటివరకు అధికారిక ప్రకటనేమీ చేయలేదు. కాగా, బాలయ్య అభిమానులు మాత్రం ఈ సనిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.