కల్యాణ్‌రామ్ – విజయశాంతి కాంబినేషన్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun Son Of Vyjayanthi). మంచి ప్రచారంతో వేసవి సందర్భంగా విడుదలైందీ చిత్రం. తల్లిగా విజయశాంతి… తనయుడిగా కల్యాణ్‌రామ్ పాత్రల్లో ఒదిగిపోయారు. రిలీజ్ కు ముందు మంచి అంచనాల్ని రేకెత్తించిన ఈ కలయిక ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించలేకపోయిందనే చెప్పాలి.
నందమూరి కళ్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఎన్టీఆర్ సినిమాపై తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు . విడుదలకు ముందు సినిమా చూసిన వారందరూ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి క్లైమాక్స్ భాగాలను ప్రశంసించారు.
అయితే నెగిటివ్ రివ్యూలు రావటం, మౌత్ టాక్ సరిగ్గా లేకపోవటం దెబ్బకొట్టింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా పెట్టుబడులను రికవరీ చేయడంలో ఇబ్బంది పడింది. సినిమా చుట్టూ ఉన్న సందడి, సినిమా నిర్మించిన బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ చిత్రం బిలో యావరేజ్ నోట్‌లో మొదలైంది. మంగళవారం కల్లా బ్రేక్ ఈవెన్ అవుతుందనే నమ్మకం కళ్యాణ్ రామ్ వ్యక్తం చేసారు.
అయితే ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ శనివారం తర్వాత కలెక్షన్స్ లో ఎలాంటి గ్రోత్ చూపలేదు. ఆదివారం బాగ్ డ్రాప్ అయ్యింది. సోమవారం నుండి, ఈ చిత్రం కనీస ఫుట్‌పాల్స్ కూడా రప్పించుకోలేకపోయింది.
45 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకి కళ్యాణ్‌రామ్ 8 కోట్లు తీసుకున్నాడు. ప్రముఖ నటి విజయశాంతి కూడా తన కీలక పాత్రకు చాలా రెమ్యునరేషన్ తీసుకుంది. నటి కూడా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీని ప్రమోట్ చేసింది కానీ ఆమె ఉనికి ఎలాంటి ప్రభావం చూపలేదు. మొత్తానికి ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కెరీర్‌లో కళ్యాణ్‌రామ్‌కు మరో నిరాశే మిగిల్చింది. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ నిర్మాతలకు పెద్ద నష్టం.