టాప్ ఇండియన్ యాక్టర్లు తమ సినిమాల కోసం శరీరాన్ని మలుచుకోవడంలో స్పెషలైజ్డ్ ట్రైనర్లు సహాయపడటం ఇప్పుడొక ట్రెండ్ అయింది. టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అరవింద సమేత వీర రాఘవ సమయంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గా ఎంట్రీ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్ గుర్తుండే ఉండి ఉంటారు. ఆ తర్వాత RRR కోసం కూడా ఎన్టీఆర్‌తో మళ్లీ కలిసి పనిచేశారు.

ఇప్పుడు అదే లాయిడ్ స్టీవెన్స్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎంపిక చేసారు. ‘పుష్ప’ లుక్ నుండి పూర్తిగా బయటకు వచ్చిన బన్నీ, గత రెండు నెలలుగా క్యాజువల్ లుక్‌లో కనిపిస్తూ కొత్త పాత్రకు సిద్ధమవుతున్నారు. లేటెస్ట్‌గా లాయిడ్ స్టీవెన్స్ తన ఇన్‌స్టాలో బన్నీతో కలిసి తీసిన ఫోటోను షేర్ చేయడంతో, ఈ ట్రాన్స్ఫర్మేషన్ దశ మొదలైనట్టు స్పష్టమైంది.

అల్లు అర్జున్ ఇప్పుడు ప్రముఖ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నారు. జూలై నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమవుతోంది. ఈ పాన్-ఇండియా సినిమాను Sun Pictures భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. పూర్తి మారిపోయిన లుక్‌తో బన్నీ ఈసారి ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నారో చూడాలంటే ఇంకొంచెం టైం వేచి చూడాల్సిందే!

You may also like
Latest Posts from